Saturday, April 27, 2024

సేవలకు సై… రవాణాకు నై

- Advertisement -
- Advertisement -

Guidlines for Lockdown 2

 

వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి
మే 3వరకు రైలు, విమాన, బస్సు సర్వీసులు రద్దు
షాపింగ్‌మాల్స్, సినిమాహాళ్లు, బార్లు, జిమ్‌లపై నిషేధం
హాట్‌స్పాట్లకు మార్గదర్శకాలు వర్తించవు
హాట్‌స్పాట్లను ప్రకటించే అధికారం రాష్ట్రాలదే
20వ తేదీ నుంచి దేవవ్యాప్తంగా అమలుకానున్న మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా విధించిన రెండో దశ లాక్‌డౌన్ అమలుకు బుధవారం కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రకాల రవాణా, అన్ని ప్రజా సంబంధిత వ్యవస్థల పునరుద్ధరణపై నిషేధం విధించింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. మద్యం, గుట్కా, పొగాకు వంటి అమ్మకాలపై కఠినతరమైన నిషేధం విధించారు. మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన ఒక రోజు అనంతరం ప్రభుత్వం ఈ గైడ్‌లైన్లు జారీ చేసింది. ఇకపోతే, అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాపరంగా ప్రజల రవాణాకు ఉపయోగపడే మెట్రో, బస్ సర్వీసుల్ని కూడా బ్యాన్ చేశారు. అయితే, సామాజిక దూరం నియమాల్ని పాటిస్తూ ఏప్రిల్ 20 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలు పనిచేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. అలాగే విద్యావ్యవస్థలు, కోచింగ్ సెంటర్లు, దేశీయ, అంతర్జాతీయ విమాన, రైలు సర్వీసుల్ని కూడా అప్పటివరకు రద్దు చేశామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.

కేంద్రం హెచ్చరిక
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మార్గదర్శకాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కోవిడ్ 19 వ్యాప్తికి దోహదపడేలా‘లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే మినహాయింపుల ఉపసంహరణ తప్పదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అన్ని సంస్థలూ, సిబ్బంది ఈ మార్గదర్శకాల్ని తప్పకుండా పాటించాలి’ అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
పౌరులు వినియోగించుకునే బహిరంగ ప్రదేశాలైన సినిమాహాళ్లు, ఈత కొలనులు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్ సెంటర్లు, క్రీడా ప్రాంగణాలను,బార్లు కూ డా మే 3 వరకు మూతబడే ఉంటాయి. అన్ని రకాల సామాజిక, రాజకీయ, క్రీడా సంబంధిత, మరపరమైన కార్యకలాపాల్ని నిషేధించారు. మతపరమైన స్థలాలు, ప్రార్థనా మందిరాలను కూడా మే 3 వరకు మూసి ఉం చాలి. జాతీయ రహదారులపై ఉండే దాబాలు, ట్రక్ రిపేరింగ్ షాపులు, కాల్ సెంటర్లు మాత్రం ప్రభుత్వ విధులకోసం ఏప్రిల్ 20 నుంచి తెరుచుకుంటాయి.

వ్యవసాయ యం త్రాలు, విడిభాగాలు, వాటి పంపిణీ, మరమ్మత్తులకు సం బంధించిన షాపులు, వ్యవసాయ యం త్రాల తాలూకు కస్టం హైరింగ్ సెంటర్లు ఏప్రిల్ 20 నుంచి పనిచేస్తాయి. వ్యవసాయం, ఉద్యాన సంబంధిత కార్యకలాపాలకు, రైతులు, వ్యవసాయ కూలీలు పొలా ల్లో పనిచేసేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించే మండీలకు ఏప్రిల్ 20 నుంచి అనుమతిచ్చారు. డ్రగ్ తయారీ యూ నిట్లు, ఫార్మాసూటికల్స్, వైద్య పరికరాలు, అంబులెన్స్‌ల తయారీ యూనిట్ల వంటి వైద్య మౌలిక సదుపాయాలు కల్పించే భాగాలు కూడా ఏప్రిల్ 20 నుంచి తిరిగి తెరుచుకుంటాయి. దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ స్థలాల్లో మాస్కు లు తప్పనిసరిగా ధరించాలని కేంద్రం ఆదేశించింది.

‘లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా యంత్రాంగాలు తమ కార్యకలాపాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ’కార్యాలయాలు, పనిచేసే ప్రదేశాలు, ఫ్యాక్టరీలు, సంస్థలలో సామాజిక దూరాన్ని విధిగా పాటించాలి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి’ అని కేంద్రం ఈ మార్గదర్శకాల్లో విజ్ఞప్తి చేసింది.

కిరాణా, పండ్లు, కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లు, పాల బూత్‌లు, పౌల్ట్రీ, మాంసం, చేపల దుకాణాలు లాక్‌డౌన్‌లో తెరిచే ఉంటాయి. ఎలక్ట్రీషియన్లు, ఐటి రిపేర్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్‌లు, వడ్రంగులు వంటి గృహావసరాల సేవలందించే వారిని కూడా ఏప్రిల్ 20 నుంచి అనుమతిస్తారు. అయితే, ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సవరించిన ఈ మినహాయింపులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించిన కోవిడ్ 19 హాట్‌స్పాట్‌లు/ కంటైన్‌మెంట్ జోన్లకు వర్తించవని హోంశాఖ కార్యదర్శి, విపత్తు నిర్వహణ చట్టం కింద పనిచేసే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్ పర్సన్ చెప్పారు.

రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మార్గదర్శకాలను బలహీనపరచకూడదని, స్థానిక అవసరాలకు తగ్గట్టు కఠిన నిబంధనలు విధించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సెజ్‌లలో నియంత్రణ ఉండే మాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ యూనిట్లు, ఎగుమతి రంగ యూనిట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లు, పారిశ్రామిక టౌన్‌షిప్‌లు కూడా ఏప్రిల్ 20 నుంచి పనిచేయవచ్చు.

వీటికి షరతుల్లేవు
రక్షణ, పారామిలిటరీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విపత్తు నిర్వహణ, ఎన్‌ఐసి, ఎఫ్‌సిఐ, ఎన్‌సిసి, నెహ్రూ యువ కేంద్రాలు, కస్టమ్స్ ఆఫీసులు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తాయని హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఇతర మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్‌లు డిప్యూటీ సెక్రెటరీ, అంతకు పై స్థాయి అధికారుల 100 శాతం హాజరుతో పనిచేస్తాయి. ‘ఆయా శాఖల్లో అధికారులు, మిగతా సిబ్బంది అవసరాలకు అనుగుణంగా 33 శాతం వరకు హాజరు కావాల్సి ఉంటుంది’ అని హోంశాఖ పేర్కొంది. ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల్ని తగ్గించేందుకు ఏప్రిల్ 20 నుంచి పరిమితంగా మినహాయింపులు ఇచ్చినట్టు ఈ మార్గదర్శకాలు తెలిపాయి. ‘లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా యంత్రాంగాలు తమ కార్యకలాపాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ’కార్యాలయాలు, పనిచేసే ప్రదేశాలు, ఫ్యాక్టరీలు, సంస్థలలో సామాజిక దూరాన్ని విధిగా పాటించాలి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి’ అని కేంద్రం ఈ మార్గదర్శకాల్లో విజ్ఞప్తి చేసింది.

మే 20 నుంచి అమల్లోకి ఈ మార్గదర్శకాలు

వీటికే అనుమతి

దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి
వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణలు తెరువచ్చు
వ్యవసాయ యంత్ర పరికరాలు, అద్దె సంస్థలకు అనుమతి
వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు
కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం మ్యాన్‌పవర్
జాతీయ ఉపాధిహామీ పనులకు అనుమతి
ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు జరుపుకోవచ్చు
బ్యాంకుల కార్యకలాపాలకు అనుమతి యథాతథం
గోదాములు, శీతల గోదాములకు అనుమతి
రహదారుల పక్కన ధాబాలు తెరుచుకునేందుకు అనుమతి
ఐటి సంస్థలకు 50శాతం సిబ్బందింతో అనుమతి
ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్‌లు,
ఐటి రిపేర్లు, కార్పెంటర్ సేవలకు ఓకే

గ్రామాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలు అనాథ, దివ్యాంగ, వృద్ధ ఆశ్రమాల నిర్వహణకు అనుమతి
భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతి నిర్మాణ పనులకు స్థానిక కార్మికులకే అనుమతి వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి
అంత్యక్రియంల్లో 20మంది మాత్రమే పాల్గొనాలి
గ్రామాల, సెజ్‌లలోని పరిశ్రమల నిర్వహణకు అనుమతి అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి అన్ని రకాల ఈ–కామర్స్ సర్వీసులు జరుపుకోవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ సర్వీసులు యథాతథం
వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయరాదు,
30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలి.

ఇవి కుదరదు

విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్
రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్
రాష్ట్ర, జిల్లా సరిహద్దులు దాటేందకు అనుమతి నిరాకరణ
రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలు నిషేధం
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా
లిక్కర్ అమ్మకాలపై నిషేధం
హాట్‌స్పాట్‌లలో నిబంధనలు మరింత కఠినం, జనసంచారం ఉండొద్దు
సభలు, సమావేశాలకు అనుమతి లేదు
విద్యాసంస్థలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దు
మాల్స్, సినిమా హాళ్లు, పార్క్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత
క్రీడలు, సంబంధిత కార్యకలాపాలపై నిషేధం
ఏ పనులకైనా ఇతర ప్రాంతాల నుంచి కూలీల తరలింపు నిషేధం

ఇవి పాటించాల్సిందే…

పబ్లిక్‌లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలి
లిఫ్టులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దు
కార్యాలయాల్లో కనీసం 6 అడుగుల దూరం
ఉద్యోగులు షిప్టులు మారే సమయంలో గంట విరామం
ఉద్యోగులు, కార్మికులకు ఆయా సంస్థలు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి
10 అంతకన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడొద్దు
ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో శానిటైజర్
విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్
వాహనాలు, కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని శానిటైజ్ చేయాలి

 

Guidlines for Lockdown 2
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News