Monday, May 6, 2024

గడ్డుకాలంలోనూ దొడ్డ మనసు

- Advertisement -
- Advertisement -

KCR government

 

ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం మహాసాయం

పారిశుద్ధ కార్మికులకు రూ.30కోట్లకు పైగా ఇన్‌సెంటివ్
రేషన్‌లబ్ధిదారులకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు జమ
పంచాయతీల అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ధిక మాంద్యంలోనూ పేదల సంక్షేమానికి అవసరమైన నిధుల మంజూరులో సిఎం కెసిఆర్ ఎలాంటి జాప్యం జరగనివ్వడం లేదు. ఆ నిధులను అగమేఘాలపై విడుదల చేస్తున్నారు. పేదలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వారి గుండెల్లో సిఎం కెసిఆర్ శాశ్వతంగా నిలిచిపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారని నియంత్రణ చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఇరవై నాలు గు గంటల పాటు శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేకం గా ఇన్‌సెంటివ్‌ను ఇస్తున్నట్లు ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా సిఎం కెసిఆర్ బుధవారం వారి కి రూ.30కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడంతోపాటు పారిశుద్ధ కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. అదే సమయంలో గ్రామ పంచాయతీల సంక్షేమంపై కూడా సిఎం కెసిఆర్ ప్రాధాన్యతనిస్తూ రూ.307 కోట్లను విడుదల చేశారు.

కాగా లాక్‌డౌన్ కారణంగా పేదల కనీస అవసరాల కోసం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి రూ. 1500 చొప్పున 74లక్షల కుటుంబాలకు మొత్తంగా రూ. 1,112 కోట్ల ను వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆయా వర్గాల ప్రజల నుంచి సిఎం కెసిఆర్‌పై అభినందనల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 139 పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) పరిధిలో 20,496 మంది పారిశుధ్య సిబ్బంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లోని 26,368 మంది పారిశుద్ధ సిబ్బంది పనిచేస్తున్నారు. వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగా ఆర్ధిక శాఖ ద్వారా సిఎం కెసిఆర్ ఇన్‌సెంటివ్‌ను అందుకున్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని పారిశుద్ధ్య సిబ్బందికి రూ.5వేల చొప్పున, జిహెచ్‌ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి రూ.7,500ల చొప్పున సిఎం ఇన్‌సెంటివ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

జిహెచ్‌ఎంసి పరిధిలోని 26,368 మందికి రూ.19 కోట్ల 77లక్షల 60వేల నగదు, మున్సిపాలిటీల పరిధిలో 20,496 మంది కి రూ.10 కోట్ల 24 లక్షల 80ల నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమకావడంపై పారిశుద్ధ కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. జిహెచ్‌ఎంసి పరిధిలోని లబ్ధిదారుల్లో శానిటేషన్ విభాగంలో 20,718 మంది, ఎంటోమాలజీ విభాగంలో 2,077 మంది, ట్రాన్స్‌పోర్టు సెక్షన్లో 2,288 మంది, వెటర్నరీ సెక్షన్లో 306 మంది, ఇవి అండ్ డిఎం విభాగంలో 979 మందిఉన్నారు. మున్సిపల్ పరిపాలన శాఖ పరిధిలోని 139 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 20,496 మంది పారిశుద్ధ్య సిబ్బంది లబ్ధిదారులుగా ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,031 మంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,692 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,100 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,140 మంది చొప్పున ఉన్నారు.

గ్రామ పంచాయతీలకు రూ.307 కోట్లు : కెసిఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 307 కోట్లను మంజూరు చేసింది. ఆర్ధిక మాంద్యం, కరోనా కష్టకాలంలోనూ సిఎం కెసిఆర్ పల్లెల ప్రగతి, పారిశుద్ధం, కరోనా నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నిధులపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందిస్తూ, రాష్ట్రంలో ఆర్థి క ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గ్రామాల్లో జరగాల్సిన పనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు కేటాయించడం సిఎం ఔదార్యానికి నిదర్శమని వ్యాఖ్యానించారు. ఈ నిధుల్లో ఒక్క నయా పైసా కూడా వృధాకావొద్దన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రేరణగా పారిశుద్ధం, కరోనా నిర్మూలనే లక్ష్యాలుగా నిధులను ఖర్చు చేయాలని సూచించారు. ప్రతిరోజు పారిశుద్ధ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ లోపం కనిపించకూడదని హెచ్చరించారు.

 

KCR government helps welfare of poor
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News