Monday, May 6, 2024

గుట్కా, విదేశీ సిగరేట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

gutka foreign cigarettes seized in hyderabad

హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు, విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్న నిందితుడిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఇనాయత హుస్సేన్ గుట్కా, పొగాకు వస్తువులు, విదేశీ సిగరేట్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలియడంతో దాడులు చేసి అరెస్టు చేశారు. వాటిని నిల్వ చేసిన సుల్తాన్ షాహీలో ఇంటిలో సోదాలు నిర్వహించారు. నిందితుడు అవసరం ఉన్న వారికి విటిని విక్రయిస్తున్నాడు. కేసు దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

gutka foreign cigarettes seized in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News