Saturday, April 27, 2024

మహిళకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధింపులు

- Advertisement -
- Advertisement -

మహిళకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధింపులు
నిందితుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: మహిళలకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్ర కారం…. ఎపిలోని గుంటూరుజిల్లా, చిలకలూరిపేట, శ్రీనివాస కాలనీ, ఎరుకల కాలనీకి చెందిన అన్పపరెడ్డి ఏడుకొండలు తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. నిందితుడికి మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసేందుకు బానిసగా మారాడు. సోషల్ మీడియాలో ఉండే మహిళలను ఎంపిక చేసుకుని వాట్సాప్ వీడియో కాల్స్ మాట్లాడేవాడు. వీడియో కాల్స్‌లో తన ఫేస్ కన్పించకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అటు నుంచి మహిళ మాట్లాడుతోందని నిర్ధారించుకున్న తర్వాత వీడియో కాల్ మాట్లాడేవాడు. తర్వాత వారికి అశ్లీల వీడియోలు, చిత్రాలు పంపించేవాడు. ఈ క్రమంలోనే బాధితురాలికి అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. రాచకొండ ఇన్‌స్పెక్టర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News