Monday, April 29, 2024

అందమైన ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్ , ధృవిక హీరోహీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్‌సింగ్ నగర్’ . తెలుగు, తమిళ బాషల్లో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోదర్శకులు వీరభద్రం, చిన్ని కృష్ణ, చంద్ర మహేష్, బాబ్జి, నిర్మాతలు శ్రీకాంత్, సతీష్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ “దర్శకుడు క్రాంతి మంచి కథను ఎంపిక చేసుకున్నాడు. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ “భగత్‌సింగ్ నగర్‌లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ ఇది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ము, హీరో విదార్ధ్, హీరోయిన్ దృవిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News