Monday, May 6, 2024

కరోనా బారిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Harish rao corona positive in Telangana

 

ట్విట్టర్ వేదికగా ప్రకటన
తనను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోవాలని సూచన
బావా మీరు అందరికంటే త్వరగా కోలుకుంటారు : మంత్రి కెటిఆర్
వైరస్‌ను ఓడించే శక్తి మీకు వస్తుంది : కవిత

మనతెలంగాణ/హైదరాబాద్: ఇటీవల అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నా రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు ఉన్నాయనే సందేహంతో పరీక్ష చేయించుకున్న హరీష్‌రావుకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈసందర్భంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకొని తన మాదిరిగానే ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పారు. తన బావ హరీష్‌రావుకు కరోనా వచ్చిందనే విషయం తెలుసుకున్న మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బావా కరోనానుంచి త్వరగా కోలుకో అని ట్వీట్ చేశారు.

ఇతరులకంటే త్వరగానే కోలుకుంటావనే నమ్మకం ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. బావా మీరు అతి త్వరగా కరోనా నుంచి బయటపడేందకు భగవంతున్ని ప్రార్థిస్తున్నామని మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ ఆత్మస్థైర్యం ఎంతో గొప్పది. కరోనాను జయించి యధావిధిగా ప్రజాసేవలో నిమగ్నం అవుతారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శాసనసభ నిబంధనల మేరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సభలోకి ప్రవేశం లేకపోవడంతో ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దాదాపుగా హరీష్‌రావు దూరంగానే ఉంటారు.

మీ ప్రేమే నాకు అసలైన వైద్యం
నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో,అభిమానంతో ఆందోళన చెందిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మీప్రేమ,అభిమానం నాకు అసలైన వైద్యం అని ఆయన తెలిపారు. దయచేసినన్ను కలవడానికి ఎవరూ ప్రయత్నించవద్దు, నాఆగోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియచేస్తానని హరీరావు పేర్కొన్నారు.

Harish rao corona positive in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News