Saturday, April 27, 2024

విదేశీ మక్కలు తీసుకొచ్చి మన నోట్లో మట్టి కొట్టిండ్రు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao speech in dubbaka elections

హైదరాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఉందా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నైజాం నుంచి సమైఖ్యాంధ్ర పాలన వరకు భూమి శిస్తూ వసూలు చేసేవారని, కానీ సిఎం కెసిఆర్ అదే రైతుల భూమికి రైతుబంధు ద్వారా డబ్బులు ఇస్తున్నారని ప్రశంసించారు. దుబ్బాక నియోజకవర్గంలో ధూంధాంగా టిఆర్‌ఎస్ ప్రచారం చేపట్టింది. తొగుట మండలం గుడికందులలో మంత్రి హరీష్ రావు రోడ్ షో చేపట్టారు. ఊరంతా కదిలి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బైరవ స్వామ ఆలయంలో హరీష్ రావు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు భరోసా ఇచ్చింది సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్ రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారని, బిజెపి వాళ్లు బావికాడ మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి పథకంతో లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని, కళ్యాణ లక్ష్మి పథకంలో కేంద్ర ప్రభుత్వానికి రూపాయి లేదన్నారు. జిల్లా మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదని స్పష్టం చేశారు. బిజెపి వాళ్లు బీడీలపై జిఎస్‌టి వేసి సగం రోజులు పని పోగొట్టిండ్రని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు బీడీ కట్టలపై పుర్రె గుర్తు వేసి మన కడుపు కొట్టిండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విదేశీ మక్కలు తీసుకొచ్చి మన నోట్లో మట్టి కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజలు ఓటు ద్వారా బిజెపి నేతలకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్, టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News