Saturday, April 27, 2024

రైతులు కూలీలుగా మారుతారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao strike on Bharat Bandh

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొత్త వ్యవసాయ చట్టాలు రద్దేయ్యే వరకు రైతుల పక్షాన పోరాడుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తుప్రాన్‌లో రైతుల నిరసనకు మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. లాల్‌బహదూర్ శాస్త్రి హయాంలో జగ్జీవన్ రావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర ఉండాలని నిర్ణయించారని గుర్తు చేశారు. 53 ఏండ్ల క్రితమే రైతులకు మద్దతు ధర ఇస్తే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం రైతులకు ఉన్న మద్దతు ధరను తుంగలో తొక్కేస్తుందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన చట్టాలు పూర్తిగా వ్యతిరేకస్తున్నామని, కొత్తం చట్టం అమలులోకి వస్తే వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతికి వెళ్తుందన్నారు. బ్రిటన్ ప్రధాని కూడా మన దేశ రైతుల గురించి స్పందిస్తారు గానీ.. మన ప్రధాని మోడీ మాత్రం స్పందించడన్నారు. కొత్త చట్టాలతో సొంత భూముల్లోనే రైతులు కూలీ చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొత్త చట్టాలు రద్దయ్యే వరకు రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News