Monday, April 29, 2024

విద్యారంగంలో ఎపికి ఒక్క అవార్డైనా వచ్చిందా

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : విద్యారంగంలోకి ఎపికి ఒక్క అవార్డు అయినా వచ్చిందా అని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పటి వైఎస్సార్ సీపీ మంత్రులని అన్నారు.

బొత్స సత్యనారాయణ విద్యావ్యవస్థపై ఓర్వలేకనే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తున్నారని ఇది సబబు కాదని గంగుల మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణపై ఆంధ్రా నాయకులు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో విద్యా విధానం బాగుందని మెచ్చుకున్నదని గుర్తు చేశారు.

విద్యావ్యవస్థలో తెలంగాణ కేరళను నుంచి మించి పోయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 298 గురుకులాలు మాత్రమే ఉండేవి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగా లేదని కమలాకర్ విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో 1009 గురుకులాలు ఉన్నాయని 67,500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.

ఎపిలో కేవలం 308 గురుకులాలు మాత్రమే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 25,000 మంది విద్యార్థులు మాత్రమే గురుకులాలలో చదువుతున్నారన్నారు. బొత్స సత్యనారాయణ నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని ఆయన ప్రశ్నించారు. తప్పు జరిగితే మా ముఖ్యమంత్రి పబ్లిక్ కమిషన్‌లో అవకతవకలు పాల్పడిన దొంగలని దొరకపట్టారన్నారు.

బొత్స సత్యనారాయణ తెలంగాణ విద్యావ్యవస్థపై మాట్లాడటం కంటే వారి రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై ఆలోచన చేస్తే బాగుంటుందని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది కాదా అని గంగుల విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించాక కూడా ఆంధ్రా నాయకుల కళ్లు తెలంగాణ మీదనే ఉందని, తెలంగాణతో మీకేం పని అని మండిపడ్డారు. తెలంగాణలో పైరవీలకు తావు లేదన్నారు. తెలంగాణలో విద్యా విధానాన్ని చూసి ఆంధ్రా నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News