Wednesday, May 1, 2024

త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వంలో అంతా సవ్యంగా లేదని జనతా దళ్(సెక్యులర్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వ్యాఖ్యానించారు. సిద్దరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి త్వరలోనే బిజెపిలో చేరనున్నారని ఆదివారం కర్నాటకలోని హసన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కుమారస్వామి వెల్లడించారు. ఆ తర్వాత ఆ మంత్రి అడుగుజాడల్లోనే 50 నుంచి 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారని ఆయన ఆరోపించారు. 50-60 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఒక కాంగ్రెస్ మంత్రి బిజెపిలో చేరతారని,

త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కుమారస్వామి జోస్యం చెప్పారు. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని, ఎవరిలోను నిజాయితే, విధేయత లేదని ఆయన ఆరోపించారు. ఆ మంత్రి పేరు చెప్పాలని విలేకరులు కోరగా అటువంటి సాహసోపేతమైన చర్యను చిన్న నాయకుల నుంచి ఊహించలేమని, చాలా పలుకుబడి కలిగిన నాయకులే అటువంటి పనులు చేయగలరని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ జెడిఎస్, బిజెపి భ్రమల్లో బతుకుతున్నాయని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News