Monday, April 29, 2024

కుమారస్వామి కుట్రలు బయటపడ్డాయి: డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో మళ్లీ 2024లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తీహార్ జైలుకు వెళతారంటూ జెడి(ఎస్) శాసనసభా పక్ష నాయకుడు హెచ్‌డి కుమారస్వామి చేసిన సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.

ఆదివారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగకుండా ఎవరూ అడ్డుకోలేరని, కనకపురా(విశకుమార్ నియోజకవర్గం)ను తామే గెలుచుకుంటామని, వచ్చే ఎన్నికల్లో తాను అభ్యర్థిగా ఉంటానో లేదో కూడా ఆయనకు(డికెఎస్) తెలియదని, ఇప్పటికే ఒకసారి తీహార్ జైలుకు వెళ్లిన డికెఎస్ ఈసారి శాశ్వతంగా వెళతారని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై డికె శివకుమార్ మంగళవారం స్పందించారు. తన కుట్రలు ఏమిటో కుమారస్వామి బయటపెట్టారు. తాను ఆ పని చేయగలనని ఆయన వెల్లడించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగా కుమారస్వామి నా సోదరి, సోదరుడు, నా భారపై కూడా కేసులు పెట్టారు అని డికెఎస్ తెలిపారు.

కుమారస్వామి తన మానసిక స్థిరత్వాన్ని కోల్పోయారని శివకుమార్ సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపి డికె సురేష్ విమర్శించారు. ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవు. తన కోరికను ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెప్పుకుని ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం పడిపోతుందంటూ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎన్ చలువరాయస్వామి ఖండించారు. రాజకీయంగా ఏకాకిగా మారతానన్న భయంతోనే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెంఎ శివలింగ గౌడ విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News