Monday, April 29, 2024

‘5 గంటలు’ నరకయాతన

- Advertisement -
- Advertisement -

చెరువులను తలపించిన హైవేలు
కాలువలుగా మారిన రహదారులు
ఎటుచూసినా జలమయం
లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద
గంట వ్యవధిలో 5 నుంచి 10
సెం.మీ. వర్షపాతం నమోదు
స్తంభించిన ట్రాఫిక్ గంటలకొద్దీ
ఇబ్బందిపడిన వాహనదారులు
పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన
మరోరెండు రోజులు వర్షాలు :
వాతావరణ శాఖ

మన తెలంగాణ/హైదరాబాద్: కుండపోత వర్షంతో విశ్వనగరం జలదిగ్బంధనమైంది. శుక్రవారం సా యంత్రం రెండు గంటల పాటు కురిసిన కుంభవృష్టి వర్షంతో భాగ్యనగర వా సులను బెంబేలెత్తిపోయారు వర్షం ధాటికి కా లనీలు, రోడ్లన్నీ పూర్తిగా నదులుగా మారాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వర కు ఎండ దంచి కొట్టింది. ఎండ వేడిమితో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అంతలోపే నగరాన్ని కారు మబ్బులు కమ్మివేయడంతో పూర్తి అంధకారం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన కుంభవృష్టి కురిసింది. నగరంలోని పలు ప్రాం తాల్లో కేవలం గంట వ్యవధి లోనే 5 నుంచి 10 సెం.మీ. మేర వర్షం కురిసింది. దీంతో వందలాది కాలనీలు నీట మునగడంతో ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇళ్లు, అపార్ట్‌మెంట్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువులు, కుంటలు ఇప్పటీకే నిండుకుండను తలపిస్తుండడంతో చెరువులు, కుంటల పరిసర ప్రాంతాలోని కాల నీ వాసులు చిగురుటాకుల వణికి పోతున్నా రు. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ఎక్క డి ట్రాఫిక్ అక్కడ పూర్తిగా స్తంభించిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అంధకారం నెలకొంది. భారీ వర్షం ధాటికి కొన్నిచోట్ల వృక్షాలు నేల కూలాయి. న్యూ బోయిన్‌పల్లిలోని చెరువు కట్ట తెగడంతో దిగువ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. గత రెండు రోజులు కిత్రం ఉగ్రరూపం దాల్చిన మూసీనది పూర్తిగా శాంతించడంతో ఊపిరి పీలుచుకుంటున్న నగరవానులను మళ్లీ కురిసిన కుండపోత వర్షం ఉక్కిరి బిక్కిరి చేసింది. భారీ వర్షానికి ముసారాం వాగు బ్రిడ్జిపై వరద నీరు నిలవడంతో పోలీసులు మళ్లీ ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

జిహెచ్‌ఎంసి అలర్ట్

నగరంలో అకస్మికంగా భారీ వర్షం కురవడంతో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని జిహెచ్‌ఎంసి మే యర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గిన వెంటనే జిహెచ్‌ఎంసి హెల్ప్ సెంటర్ 040-21111111 నంబర్‌కు కాల్ చేయాల్సిందిగా నగరవాసులకు సూచించారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డిజాస్టర్ బృందాలను అ ప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జిహెచ్‌ఎంసి అధికారులు సూచించారు. సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే భారీవర్షంతో వారు చేతులెత్తేశారు. వర్షం తగ్గిన తర్వాత రోడ్లపై నిలిచిన నీటిని తొలగించా రు. పోలీసులు సైతం నగరంలో భారీ వర్షం నేపథ్యం లో రెండు గంటల పాటు రోడ్లపైకి రావద్దంటూ నగర వాసులకు సూచించారు. రోడ్లపై చేరిన వరద నీరు వెళ్ళిన తర్వాత రావాల్సిందిగా పేర్కొన్నారు. అయినప్పటికీ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోయింది. సరిదిద్దేందుకు సుమారు 6గంటలపైనే సమయం పట్టింది.

గంట వ్యవధిలో 9.5 సె.మి.వర్షం

నేరెడ్‌మెట్‌లో గంట వ్యవధిలోనే 9.5 సె. మి.లకు పైగా వర్షం కురిసింది. అదేవిధంగా మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌లో 7.3 సె.మి., మల్కాజ్‌గిరిలో 6.7, తిరుమల్‌గిరి 6.3, హయత్‌నగర్ 6.2,కాప్రా 6.8, కుషాయిగూడ 5.9, అల్వాల్ 5.8, మధుసూధన్‌నగర్ 5.6, ఫతేనగర్ 5.5, వెస్ట్ మారెడ్‌పల్లి 5.3, బేగంపేట్ 5.0, మొండా మార్కెట్ 4.7, సీతాఫల్ మండి4.6, ఫికెట్ 4.5, కుత్బుల్లాపూర్ 4.5,మౌలాలి 4.5, బాలానగర్ 4.2, వనస్థలిపురం 4.0 సె.మి. వర్షం కురిసింది. కుర్మగూడలో సౌత్ హస్తినాపురంలో ఆస్మాన్ ఘడ్, చార్మినార్ ఎల్‌బినగర్, కాంచన్ బాగ్, చందూలాల్ బరాదారిలో, రెయిన్ బజార్, అల్కపూరి, అత్తాపూర్, రాజేంద్రనగర్, శివరాంపల్లి, మలక్‌పేట్ దూద్‌బౌలి, నాంపల్లి, అంబర్‌పేట్ మెహిదిపట్నం, కాచిగూడ , చంద్రాయణ్‌గుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొం డాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, మూసాపేట్, ఎస్‌ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్‌రోడ్, ముషీరాబాద్, రాంనగర్, ఓయు చిలకలగూడా సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, చిలకనగర్, నాగోల్ కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్ కోఠి ప్రాంతాల్లో సైతం 2 నుంచి 4 సె.మి.లోపు వర్షపాతం నమోదైంది.

5 గంటలు రోడ్లపై నరకయాతన

భారీ వర్షంతో నగర ప్రయాణికులు 5 గంటల పాటు నరక యాతన పడ్డారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం రెండు గంటల పాటు కుంభవృష్టిని తలపించింది. దీంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే స్తంభించిపోయింది. భారీ వర్షంతో అనేక మార్గాల్లో నడుం లోతుకు మించి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలైయ్యాయి. ఈ వరద నీరు పోయేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టడం, రోడ్లపై నిలిచిన నీటితో ట్రాఫిక్ పూర్తిగా నెమ్మదించడంతో అన్ని ప్రధాన మార్గాలల్లో కిలో మీటర్ల మేర వాహనాలు భారులు తీరాయి. దీంతో నగరవాసులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సి వచ్చింది. ప్యారడైజ్ పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తభించిపోవడంతో కేవలం రెండు కిలో మీటర్ల మేర ప్రయాణికే 4 గంటల సమయం పట్టింది. అదేవిధంగా ఎల్‌బినగర్ నుంచి హయత్‌నగర్ వరకు విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దిల్‌సుఖ్ నగర్, కోఠి, లక్డీకాపూల్ నుంచి కూకట్‌పల్లి, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మాధాపూర్ , పెన్షన్ లైన్ జూబ్లీహిల్స్ మాసబ్‌ట్యాంక్ నుంచి మెహిదిపట్నం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పాడ్డాయి. దీంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయానికే భారీ వర్షం కురవడంతో విద్యార్థులు, ఇళ్లకు చేరుకునేందుకు4 నుంచి 5 గంటల సమయం పట్టింది. అదేవిధంగా 5 గంటలకు విధులో నుంచి బయటికి వచ్చిన ఉద్యోగులు సైతం ట్రాఫిక్ జామ్‌లతో రాత్రి 8 గంటలకు కాని ఇళ్లకు చేరని పరిస్థితి ఏర్పడింది. నగరంలో ట్రాఫిక్ క్లియర్ కావడానికి దాదాపుగా 6 గంటలకు పైగా సమయం పట్టింది. చివరికి హోంమంత్రి మహమూద్ అలీకి సైతం ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News