Home తాజా వార్తలు రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు..

రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు..

Rains in Telangana and AP for next 4 days

మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌ఘడ్ వరకు ఉత్తర, దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఐఎండి గణాంకాల ప్రకారం 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం అధిక వర్షపాతం నమోదయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Heavy Rains in Telangana for next 2days