Thursday, May 9, 2024

గవర్నర్‌గిరిలు చెల్లవు.. అనుకున్నదే చేస్తాం

- Advertisement -
- Advertisement -

రాంచీ : కేంద్రంలో బిజెపి వత్తాసుతో రాష్ట్రాలలో గవర్నర్ల వ్యవహారశైలి శృతి మించిందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శించారు. ప్రత్యేకించి బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారని, ఆయా రాష్ట్రాల పాలనలో గవర్నర్లు మోకాలడ్డుడు తీరులో వ్యవహరిస్తున్నారని సోరెన్ సోమవారం కాత్యాయని జోహార్ యాత్ర పేరిట జనంలోకి వెళ్లుతున్న దశలో మాట్లాడారు. అధికారంలో లేని రాష్ట్రాలలో గవర్నర్లను తమ ఏజెంట్లుగా వాడుకునే తంతు సాగుతోందని సోరెన్ విమర్శించారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో గవర్నర్ల పాత్ర , దీనిపై ఆయా రా్రష్ట్ర ప్రభుత్వాల స్పందన నేపథ్యంలోనే సోరెన్ మాట్లాడారు. అదే విధంగా ఒక్కరోజు క్రితం జార్ఖండ్ గవర్నర్ రమేష్ బయాస్ రెవెన్యూ రికార్డుల సంబంధిత బిల్లును తిప్పిపంపారు.

రివ్యూకు సూచిస్తూ నోట్‌పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను , బిల్లులను గవర్నర్లు తొక్కిపెట్టడం ఇప్పుడు ఈ విధంగా సర్వసాధారణం అవుతోందని మండిపడ్డారు. ఇటీవలి కాలంలో అసాధారణాలు అత్యంత సాధారణాలు అయ్యాయని వ్యాఖ్యానించారు. తాము పంపిన బిల్లుపై గవర్నరు రాతలను తాను ఇంకా పూర్తిగా చూడలేదన్నారు. జార్ఖండ్‌లోని సెరాయికెలా ఖర్సవాన్ జిల్లాలో జోహార్ జనయాత్రలో సిఎం మాట్లాడారు. జార్ఖండ్‌కు సంబంధించి గవర్నర్ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా నడవటం ఇది తొలిసారి కాదని తెలిపారు. బిజెపి అధికారంలో లేని పలు చోట్లా ఇదే విధంగా జరుగుతోందన్నారు. గవర్నర్లను ఎంచుకుని వారి ద్వారా విపక్ష రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టడం జరుగుతోందన్నారు. అయితే ఇది ఢిల్లీ లేదా, జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ ఇతర ప్రాంతాలు వంటి ప్రాంతం కాదని ఇది జార్ఖండ్ అని ఇక్కడ ప్రభుత్వం కోరుకునేది , అమలు అవుతుంది తప్ప గవర్నర్ ఆకాంక్షలకు అనుగుణంగా పనులు జరగబోవని తేల్చిచెప్పారు.

జార్ఖండ్‌లో 1932 నాటి భూ రికార్డుల అంశం

జార్ఖండ్‌లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది 1932 భూ రికార్డుల అంశం. దీనిని ప్రాతిపదికగా చేసుకుని ప్రజల స్థానికత హోదాను నిర్థారించుకునే విధంగా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, దీనిపై తిరిగి సమీక్షించుకోవాలని బిల్లుకు ఆమోదం తెలియచేయకుండా గవర్నర్ తిప్పి పంపడం వివాదాస్పదం అయింది. కొందరు దీనిని రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారని, అయితే ఆదివాసీలు, మూలవాసీలకు ప్రాధాన్యత క్రమాలలో ఉపాధి ఆవాసం కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందా? ఇందుకు పాత రికార్డులను ఆధారం చేసుకోవడం తప్పిదం అవుతుందా? ఏది న్యాయం? ఏది అన్యాయం? అని గవర్నర్ పేరు ప్రస్తావించకుండా సిఎం సోరెన్ మండిపడ్డారు. బడుగు వర్గాలకు న్యాయం విషయంలో సుదీర్ఘ పోరాటం తప్పదని తమకు తెలుసునని, ప్రతిబంధకాలను తొలిగించుకుని ముందుకు వెళ్లుతామని జనం యాత్ర దశలో వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News