Monday, April 29, 2024

చిన్నా సినిమా నా లైఫ్ డ్రీమ్: సిద్దార్థ్

- Advertisement -
- Advertisement -

టాలెంటెడ్ యాక్టర్ సిద్ధార్థ్ సరికొత్త పాత్రలో నటించిన చిత్రం ‘చిన్నా’. ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ఎటాకి సంస్థ నిర్మించింది. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడులవుతోంది ఈ చిత్రం. చిన్నాన్నకి, అతని అన్నయ్య కూతురుకి మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని తెర మీద అత్యద్భుతంగా చూపించిన సినిమా ఇది. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ మాట్లాడుతూ “చిన్నా సినిమాను తెలుగులో విడుదల చేస్తోన్న ఏషియన్ మల్టీప్లెక్స్ వారికి థాంక్స్. తెలుగుకి సరిపోయేలా చక్కటి డైలాగ్స్ రాశారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను”అని తెలిపారు. హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ “చిన్నా సినిమా నా లైఫ్ డ్రీమ్. దీన్ని చేయటానికి నాకు 22 సంవత్సరాలు పట్టింది. ఇదే విషయాన్ని మా గురువుగారు మణిరత్నంకి కూడా చెప్పాను. దానికి ఆయన ఎందుకలా చెబుతున్నావని అడిగారు. దానికి నేను ‘నా కెరీర్ ప్రారంభించినప్పుడు… ఏదో ఒక రోజు నేనొక సినిమా తీస్తాను.

అమ్మతోడు ఇంత కంటే బెటర్ సినిమా నాకు తీయటం రాదనే పరిస్థితి నాకు వస్తుంది. ఆరోజు చిన్నా రూపంలో వచ్చింది’ అందుకనే అలా చెప్పాను అని మణిరత్నంతో అన్నాను. నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమా ఇది. సిద్ధార్థ్ అనే వ్యక్తి ఎందుకు నటిస్తున్నాడు.. ఇంకా యాక్టర్‌గా కొనసాగుతున్నాడని చెప్పటానికి సమాధానమే ఈ సినిమా. నేను కె.విశ్వనాథ్ సినిమాలను చూసే మూవీస్ గురించి నేర్చుకున్నాను. అందుకనే చిన్నా సినిమాను ఆయనకు అంకితమిస్తున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రై.లి హెడ్ జాన్వీ, రైటర్ కృష్ణకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News