Monday, April 29, 2024

తెల్లరేషన్ కార్డు ఉంటే రూ. 1500 ఇవ్వాలి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

High Court

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని తక్షణం ఆదుకోవాలని, ముఖ్యంగా పేదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం సాయంత్రం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేషన్ సరుకులతో సంబంధం లేకుండా తెల్లకార్డున్న వారందరికీ రూ.1500 ఇవ్వాలని హైకోర్టు ఆ ఆదేశాలో పేర్కొంది. కొందరు తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.1500 నిలిపివేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు.

మూడు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోలేదన్న కారణంగా రూ.1500 ఇవ్వలేదని దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. రూ.1500లు నిలిపివేసే ముందు లాక్ డౌన్ పరిస్థితిలో పేదల స్థితిగతులను ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించిందిజ లబ్దిదారులకు కనీసం నోటీసు ఇవ్వకుండా 8 లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించడంతో తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయలేదని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు.

అయితే ఏజీ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. 8 లక్షల మందికి ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపివేశారో పూర్తి వివరాలు కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. అయితే పూర్తి నివేదిక సమర్పించేదుకు కాస్త సమయం కావాలని ఎజి ధర్మాసనాన్ని కోరడంతో తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది ఈక్రమంలో రాష్ట్రంలో కొంతమంది రేషన్ కార్డు దారులకు రూ. 1500 నగదు నిలిపివేయడంతో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టన అనంతరం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గిరిజనులకు, వలస కూలీలకు ఉచిత బియ్యం, సరుకులు ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా రేషన్ కార్డులు లేని నిరుపేదలకు బయో మెట్రిక్‌తో సంబంధం లేకుండా ఉచిత రేషన్ బియ్యం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలావుండగా రాష్ట్రంలో వివిధ కారణాలతో తెల్లరేషన్ కార్డులు తాత్కాలికంగా రద్దయ్యాయి. ఈక్రమంలో లాక్‌డౌన్ కారణంగా వాటిని పునరద్దరించుకోవడం లబ్దిదారులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ కార్డులను తిరిగి యాక్టివ్ చేయాలని కోరడంతో ప్రభుత్వం వాటిని తిరిగి పునరుద్దరించేందుకు కసరత్తు ప్రారంభించింది. కాగా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దయిన కార్డులను యాక్టివ్ చేసిన పక్షంలో నిరుపేదలకు జూన్ మాసంలో రేషన్ షాపులలో ఉచిత బియ్యం, నగదు అందే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News