Thursday, May 9, 2024

ప్లాస్మాథెరపీపైనే ఆశలు

- Advertisement -
- Advertisement -

Plasmotherapy

 

నెలరోజుల గడిచిన రోగులపై తగ్గని కరోనా ప్రభావం
చికిత్సను ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాట్లు
దీనికోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కమిటీ నియమాకం
కమిటీ ఎంపిక చేసివారికే ప్లాస్మాథెరెపీ చికిత్స

మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ నుంచి త్వరగా రోగులు బయటపడాలంటే ప్లాస్మా థెరపీ విధానమే చివరి ఆస్త్రమని వైద్యులు వెల్లడిస్తున్నారు. దీని ద్వారా పాజిటివ్ వచ్చిన వారి ప్రాణాలు కాపాడేందుకు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు ఈనూతన చికిత్స ప్రారంభించేందుకు సిద్దమైయ్యారు. రోగుల కుటుంబ సభ్యులు కూడా ఆఖరి ఆశలు దీనిపై పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈచికిత్స చేసేందుకు ఆరోగ్యశాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో వైద్యులు ఆరోగ్యం విషమించిన కరోనా పాజిటివ్ రోగులకు ఈచికిత్సను వినియోగించనున్నారు. గాంధీలో ప్లాస్మా ధెరపీని అందించడానికి ఇప్పటికే ప్రభుత్వం నైతిక విలువల కమిటీని నియమించింది. ఎవరికి చికిత్స చేయాల్లో ఈకమిటీ నిర్ణయిస్తుంది. ప్లాస్మా అనేది కరోనా వైరస్ నుంచి బయటపడి వారిలో యాంటీ బాడీ కణాలు ఎక్కువగా ఉంటాయి.

వారిలోని రక్త నమూనాలు సేకరించి ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు వేరు చేసిన తరువాత మిగిలేది ప్లాస్మా. దీనిని కరోనా తీవ్రత ఉన్న వారికి ఎక్కిస్తే వారం రోజుల్లో కొలుకుంటారు. ఈవిధానం ద్వారా కరోనా భూతాన్ని తరిమికొట్టవచ్చని ఆరోగ్యశాఖ పేర్కొంటుంది. ఇప్పటివరకు 363మంది రోగులు కరోనా వైరస్ నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరారు. వీరిలో 20 నుంచి 40వయస్సు లోపు ఆరోగ్యవంతులను ఎంపిక చేస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈతరహా చికిత్స అందించడానికి ప్రత్యేక వైద్యనిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక వ్యక్తి ద్వారా వారికి సంబంధించిన కుటుంబాల్లో అత్యధికులు వైరస్ బారినపడుతున్నారు.

అత్యధిక కేసులు రాజధాని నగరం కావడంతో ఈతరహా చికిత్స ఉత్తమని వైద్యులు భావిస్తున్నారు. గ్రేటర్ నగరంలో 44 కుటుంబాల్లో 288మందికి పాజిటివ్ వచ్చింది. ఒక్కొ కుటుంబంలో సగటును ఏడుగురికి సోకింది. కొన్ని కుటుంబాల్లో 15నుంచి 25మందికి వ్యాప్తించింది. కరోనా సోకిన వారు ఆసుపత్రుల్లో నెలరోజుల పాటు చికిత్సలు పొందుతున్నారు. 14 రోజుల గడువు తరువాతే పరీక్షలో నెగిటివ్ రావాల్సి ఉండగా కొందరికి నెల దాటిన పాజిటివ్‌గా నమోదువుతోంది. ఈవిధంగా 200మందివరకు ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించినట్లు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

 

Hopes on Plasmotherapy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News