Saturday, April 27, 2024

27న ‘హౌస్ అరెస్ట్’

- Advertisement -
- Advertisement -

కంపెనీ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కమేడియన్స్ శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఈనెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నాము” అని తెలిపారు. రవిబాబు, అదుర్స్ రఘు, రవి ప్రకాశ్, తాగుబోతు రమేశ్, ఫ్రస్టేటెడ్ సునైన, కౌశిక్ తదితరులు నటించారు.

‘House Arrest’ Movie to release on Aug 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News