Monday, April 29, 2024

భారీగా పెరిగిన రద్దీ.. ఇకనుంచి 4 నిమిషాలకే మెట్రో రైలు

- Advertisement -
- Advertisement -

ఇక 4 నిమిషాలకే ఒక మెట్రో రైలు…
స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి మెట్రో సరికొత్త నిర్ణయం
షార్ట్ లూప్ ట్రిప్పులు అందుబాటులోకి…
హైదరాబాద్: కొద్ది రోజులుగా మెట్రో రైళ్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో రైల్ ఎల్ అండ్ టి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ మేరకు షార్ట్ లూప్ ట్రిప్పులను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు రద్దీని నియంత్రించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రోస్టేషన్ల నుంచి షార్ట్ లూప్ రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు.

దీంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా భావిస్తే ఇవి అందుబాటులోకి వస్తాయి. రద్దీ లేని గంటలు (నాన్ పీక్ అవర్స్)లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇప్పటి వరకు ప్రతి 7 నిమిషాలకు ఒక ట్రైన్ ఉంటే తాజాగా దానిని 4 నిమిషాల 30 సెకన్లకు తగ్గించారు. అమీర్‌పేట్, రాయదుర్గం కారిడార్‌లో ఈ సదుపాయం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు అన్ని ప్రధాన మెట్రో స్టేషన్లలో అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. రద్దీని నియంత్రించడానికి మహిళా గార్డులతో సహా సిబ్బందిని పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News