Wednesday, December 4, 2024

భార్య వేధింపులు తట్టుకోలేక కాలువలో దూకి….

- Advertisement -
- Advertisement -

woman jumped into canal with two children at vijayawada

 

కరీంనగర్: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా అల్గునూరులో జరిగింది. స్థానికులు గమనించి అతడిని నీళ్లలో నుంచి బయటక తీశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడకు చెందిన వెంకటేశ్‌కు కొన్ని సంవత్సరాలు క్రితం యువతితో పెళ్లి జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి భర్తను భార్య వేధిస్తోంది. ఆమె వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అల్గనూరు సమీపంలో కాలువలో అతడు దూకాడు. చేపలు అమ్మే వ్యక్తి బాలరాజు ఇది గమనించి అక్కడ ఉన్న స్థానికులను అప్రమత్తం చేశాడు. తన దగ్గర ఉన్న తాడును కాలువలోకి వేసిన అతడు పట్టుకోక పోవడంతో బాలరాజు నీళ్లలోకి దిగి వెంకటేష్‌ను బయటకు లాక్కొచ్చాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని పట్టుకున్నారు. ప్రాణాలు తెగించి వెంకటేష్‌ను కాపాడిని బాలరాజు, మరో ఇద్దరిని పోలీసులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News