Friday, April 26, 2024

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. తర్వాత అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నిక పోలీంగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

Huzurabad by poll schedule released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News