Monday, April 29, 2024

మెట్రో సువర్ణ ఆఫర్…

- Advertisement -
- Advertisement -

Hyderabad Metro Suvarna Offer

ప్రయాణికుల ఆదరిస్తారని భావిస్తున్న అధికారులు
ఆఫర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్న నగర వాసులు
20ట్రిప్పులకు కొనుగోలు చేస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులకు అవకాశం
పెరుగుతున్న చమురు ధరలతో మెట్రో వైపు మొగ్గుచూపుతున్న జనం

మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో రోజుకు లక్షలాది మంది వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ మెట్రో రైల్ ఇటీవల ప్రవేశ పెట్టిన సువర్ణ ఆఫర్ నేటి నుంచి అమలు చేస్తున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ప్రవేశపెడితే చాలామంది ఆదరించి మెట్రోపై దర్జాగా తిరిగారని, ప్రస్తుతం ప్రవేశపెట్టి ఆఫర్‌ను కూడా నగర వాసులు ఆదరిస్తారని భావిస్తున్నారు. గత నెల నుంచి మెట్రో రైల్ సేవలు పొడిగించడంతో ప్రయాణీకులు సంఖ్య రోజుకు 1.50లక్షల వరకు చేరుగా, నూతన పథకాలతో మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు 2.50లక్షల మంది చేరుకునేలా చేస్తామని, ప్రయాణికులు సులువుగా ఉండే విధానాలు తీసుకొస్తే తమ లక్ష్యం చేరుకుంటామని వెల్లడిస్తున్నారు. సువర్ణ ఆఫర్ నేటి 15 జనవరి 2022వరకు ఉంటుందని ప్రయాణికులు కొనుగోలు చేసి మెట్రో సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి 45 రోజుల పాటు తిరగవచ్చని మెట్రో స్మార్ట్ కార్డ్ (పాత, నూతన) పై మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఎంజీబిఎస్, జెబిఎస్ పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల మధ్య గ్రీన్‌లైన్‌పై ప్రయాణించే ప్రయాణికులు ప్రతి ట్రిప్‌కు గరిష్టంగా రూ. 15 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అదే విధంగా ఆకర్షనీయమైన బహుమతులను ప్రతి నెల గెలుచుకునే అవకాశం కల్పిస్తూ ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సిఎస్‌సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తారు. వీరు ఓక్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సిఎస్‌సీ (కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు)లను టీ సవారీ, మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి సూచిస్తున్నారు.

కొత్త ఆఫర్లపై నగరవాసులు ప్రశంసలు: మెట్రో అధికారులు ప్రయాణికులు పరిస్దితులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఆఫర్లు తీసుకురావడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా దెబ్బకు ఉపాధి అవకాశాలు కోల్పోడంతో పాటు చమురు ధరలు భగ్గుమనడంతో మెట్రోలో ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ఆఫర్లు పెడితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంటున్నారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఆఫర్లు తీసుకరావాలని కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News