Monday, April 29, 2024

రేపు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు

- Advertisement -
- Advertisement -
Hyderabad metro to start at 6 am from tomorrow
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో వేళల్లో మార్పులు
ఓ ప్రయాణికుడు ట్విటర్ చేయడంతో స్పందన
సువర్ణ ఆఫర్ వైపు మొగ్గు చూపుతున్న ప్రయాణికులు
ప్రయాణికుల సంఖ్య పెరిగితే ఆదాయం వస్తుందంటున్న అధికారులు

హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. రేపటి నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్ద సమయంలో మార్పులు చేసింది. తొలి రైలు మొన్నటివరకు ఉదయం 7గంటలకు ప్రారంభమైతుండగా బుధవారం నుంచి ఉదయం 6 గంటలకు మెట్రో రైలు ప్రారంభ మైతుందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలు దేరి రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మెట్రో సేవలు పొడిగించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావును ఓ ప్రయాణికుడు కోరడంతో వెంటనే మంత్రి స్పందించి మెట్రో ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో వేళ్లలో మార్పులు చేశారు. అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ఉదయం వేళ మెట్రో రైలు ప్లాట్‌పామ్‌ల వద్ద రైళ్ల కోసం ఎదురు చూస్తున్న జనం రద్దీ, వృద్దులు, మహిళలు పడుతున్న ఇబ్బందులు వీడియో తీసి మంత్రి కెటిఆర్‌కు ట్విటర్ ద్వారా రెండు రోజుల కితం ట్యాగ్ చేశారు.

తెల్లవారుజూమునే నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు సరిగా లేక ఇబ్బందుల పడుతున్నట్లు పేర్కొంటూ ఉదయం 6 గంటలకు మెట్రో రైళ్లు నడిపేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి కెటిఆర్ స్పందించి అభినవ్ మాటాలతో ఏకీభవిస్తున్నట్లు రీట్వీట్ చేసి, మెట్రో ఎండీ తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనికి మెట్రో అధికారులు సానుకూలంగా స్పందించి, నేటి నుంచి మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకే పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. గత రెండు నెలల నుంచి రైలు సేవలు పొడిగించడంతో రోజుకు 1.10లక్షల మంది వివిధ ప్రాంతాలకు వెళ్లుతుండగా, దీనిని గమనించి మెట్రో వైపు జనాలు మొగ్గు చూపేందుకు గత నెల 18వ తేదీ నుంచి సువర్ణ ఆఫర్ తీసుకొచ్చి 30 ట్రిప్పులను కేవలం 20ట్రిప్పుల ధర చెల్లించి 45 రోజుల పాటు తిరగవచ్చని, మెట్రో స్మార్ట్ కార్డుపై మాత్రమే వర్తిసుందని తెలిపారు.

అదే విధంగా ఆకర్షనీయమైన బహమతులను ప్రతి నెల గెలుచుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సిఎస్‌సీ కార్డు వినియోగదారులు నుంచి ఎంపిక చేస్తామని మెట్రో ఉన్నతాధికారులు తెలిపారు. వీరు ఓ క్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆఫర్ణ ఆఫర్ కార్డులు సుమారుగా 90వేలు మంది కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈఆఫర్ 15 జనవరి 2022 వరకు ఉండటంతో మరో 50 వేల మంది కార్డులు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.మెట్రో ప్రయాణికులు చలి కావడంతో వైరస్ పుంజుకునే అవకాశముంటుందని, ప్రతి ఒకరు కరోనా నిబంధనలు పాటించి సుఖంగా ప్రయాణం చేయాలని మెట్రో సిబ్బంది కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News