Monday, May 6, 2024

క్యాన్సర్‌ను జయిస్తా

- Advertisement -
- Advertisement -
I will be out of this cancer soon Says Sanjay Dutt
నటుడు సంజయ్ దత్ విశ్వాసం

ముంబయి: తనకు క్యాన్సర్ వచ్చిన విషయాన్ని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొదటిసారి ధృవీకరించారు. క్యాన్సర్‌ను జయిస్తానన్న విశ్వాసాన్ని 61 సంవత్సరాల సంజయ్ దత్ వ్యక్తం చేశారు. ఊపరితిత్తుల క్యాన్సర్‌తో సంజయ్ బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో వైద్య చికిత్సలు చేయించుకోవడానికి కొంతకాలం సినిమా షూటింగ్‌లకు విరామం ఇస్తున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో సంజయ్ దత్ ప్రకటించారు. ప్రముఖ హెయిర్‌స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెలూన్‌లో హెయిర్ కట్ చేసుకుంటూ బుధవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో సంజయ్ ఒక వీడియో పోస్ట్ చేశారు. హెయిర్ కట్‌లో భాగంగా హకీమ్ డిజైన్‌చేసిన ఒక గీతను చూపిస్తూ ఇది తన జీవితంలో కొత్తగా ఏర్పడిన గీతని, అయితే తాను దీన్ని జయిస్తానని, త్వరలోనే క్యాన్సర్ నుంచి బయటపడతానని సంజయ్ పేర్కొన్నారు.

వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న కెజిఎఫ్-2 కోసం తాను గడ్డం పెంచుతున్నానని సంజయ్ తెలిపారు. నవంబర్‌లో షూటింగ్ జరగనున్న ఈ చిత్రం కోసం తనకు ఈ లుక్ అవసరమని, సెట్స్‌లో మళ్లీ వెళుతున్నందుకు ఆనందంగా ఉందని ఆయన వీడియోలో తెలిపారు. రణబీర్ కపూర్‌తో కలసి నటిస్తున్న షంషేరా సినమా డబ్బింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని సంజయ్ తెలిపారు. సంజయ్ దత్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని వీడియో చివరిలో హకీమ్ చెప్పారు. తాను మళ్లీ వర్క్ అవుట్స్ చేస్తున్నానని, మళ్లీ తన కండలు తిరిగి పుంజుకుంటున్నాయని సంజయ్ ఇందుకు సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News