Friday, May 3, 2024

బొంబాయి హైకోర్టుకు వెళ్లండి

- Advertisement -
- Advertisement -
Supreme Court tells Republic TV to approach Bombay HC
రిపబ్లిక్ టివికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ముంబయి పోలీసులు నమోదు చేసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టిఆర్‌పి) కుంభకోణం కేసులో బొంబాయి హైకోర్టును ఆశ్రయించవలసిందిగా రిపబ్లిక్ మీడియా గ్రూపును సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ హైకోర్టు పనిచేస్తూనే ఉందని, రిపబ్లిక్ మీడియా గ్రూపు కార్యాలయం ముంబయిలోని వొర్లి ప్రాంతంలోనే ఉన్నందున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్ర, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రిపబ్లిక్ మీడియా గ్రూపును ఆదేశించింది.

కాగా..ముంబయి పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై రిపబ్లిక్ మీడియా తరఫున కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అనుమానాలు వ్యక్తం చేశారు. కమిషనర్లు కూడా ఇంటర్వూలు ఇచ్చే కొత్త పోకడలు వచ్చాయని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. టిఆర్‌పి కుంభకోణంపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు రిపబ్లిక్ టివి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎస్ సుందరంకు సమన్లు జారీచేశారు. ఈ కేసుకు సంబంధించి ఫక్త మరాఠీ, బాక్స్ సినిమా చానళ్ల యజమానులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News