Friday, April 26, 2024

నేడు మార్కెట్‌లోకి ఐఐటి ఢిల్లీ టెస్టు కిట్

- Advertisement -
- Advertisement -

iit delhi low cost covid 19 test kit launched

న్యూఢిల్లీ : ఐఐటి ఢిల్లీ రూపొందించిన తక్కువ ధర కోవిడ్ 19 టెస్టు కిట్ బుధవారం మార్కెట్‌లోకి రానుం ది. ప్రత్యామ్నాయ పద్ధతిలోదీనిద్వారా కరోనా అనుమానిత రోగులకు పరీక్షలు నిర్వహిస్తారు. వాణిజ్యపరంగా బుధవారం దీనిని విడుదల చేస్తారు. ఈ చౌకధర కిట్‌కు ‘కరోస్యూర్’ అని పేరు పెట్టారు. దీనిని మార్కెట్‌లోకి తీసుకువస్తున్న విషయాన్ని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ మంగళవారం తెలియచేశారు. అయితే దీని ధర ఎంత ఉంటుందనేది వెల్లడించలేదు. దేశంలో ఓ విద్యాసంస్థ రూపొందిస్తున్న తొలి కోవిడ్ టెస్టుల పరికరం ఇదే. ఈ పరికరం వాణిజ్యపరం చేసే పాక్షిక లైసెన్స్‌లను కంపెనీలకు జారీ చేశారు. ఆయా కంపెనీలు ధరను ఖరారు చేసుకునేందుకు వీలుంటుంది.

అయితే ఐఐటి వారు దీనికి గరిష్ట ధర రూ 500గా ఖరారు చేశారు. న్యూటెక్ మెడికల్ డివైస్ అనే కంపెనీ దీనిని మార్కెట్ చేస్తుంది. లాంఛనంగా ఈ పరికరాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర హెచ్‌ఆర్‌డి సహాయ మంత్రి సంజయ్ ధోత్రేలు విడుదల చేస్తారు. తక్కువ ధరలకు దొరికే ఈ టెస్టు కిట్‌తో దేశంలో వైరస్ పరీక్షల దిశలో సరికొత్త దశ ఆరంభం అవుతుందని. , దీని సైజ్, ధరల కోణంలో చూస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని ఐఐటి వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ దేశంలో ఉన్న పలు కోవిడ్ పరీక్షల విధానాలు అన్నీ కూడా పలు రకాల ఇతరత్రా పరీక్షలతో ముడిపడి ఉన్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఈ పరికరం ద్వారా వేరే పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే వైరస్ నిర్థారణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, వైరస్ సోకిందీ లేనిదీ నిర్థిష్టంగా తక్కువ వ్యయంతోనే కనుగొనవచ్చునని ఐఐటి ఢిల్లీ వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News