Saturday, April 27, 2024

వేధిస్తోన్న కొవిడ్ అనంతర సమస్యలు

- Advertisement -
- Advertisement -

Illness problem in some people after recovery from Covid

మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది లో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా యి. కొవిడ్ బారిన పడి కోలుకున్న త ర్వాత కొంతమంది తీవ్ర అలసట, శ్వా స తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జ్వ రం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో కొన్ని సమస్యలు ధీర్ఘకాలికం గా కొనసాగడం బాధితుల్లో ఆందోళన కలిగిస్తోంది. పోస్టు కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు రెగ్యులర్ చేసుకు నే పనులు కూడా సక్రమంగా చేసుకోలే క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మె ట్లు ఎక్కినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు త్వరగా అలసిపోవడం, శ్వాస తీసుకో వడంలో ఇబ్బందులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు బాధితులు చెబుతున్నారు.

పోస్టు కొవిడ్‌లో ప్రధాన లక్షణాలు

ఎడతెరపి లేని దగ్గు..

కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో దగ్గు ప్రధానమైం ది. అయితే ఇది కొందరిలో తక్కువ మోతాదులో ఉంటే మరి కొందరిలో తీవ్రంగా కనిపిస్తోంది. అయితే కరోనా నుంచి బయట పడ్డ తర్వాత కూడా దగ్గు కొనసాగుతున్నట్లు గుర్తించారు. అయితే దగ్గుతో పాటు తెమడ పడుతుంటే దానిని టీబీగా అనుమానించాలని వైద్యు లు చెబుతున్నారు. ఎడతెరపి లేకుండా దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

తీవ్ర అలసట

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో సాధారణ అలసట ఉంటే మరికొందరు తీవ్ర అలసటకు లోనవుతున్నారు. కొద్దిగా మెట్లు ఎక్కగానే లేదా కొద్దిసేపు నడిస్తేనే అలిసిపోతున్నారు.అలాగే కొంత మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపిస్తు న్నాయి. అయితే ఈ లక్షణాలు రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు తగ్గకుండా అలాగే ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్ర దించి తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులు..

కరోనా సోకిన సమయంలో చాలా మంది కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో బాధపడే ఉంటారు. అయితే కొంతమందిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా వరకు కూడా ఈ లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ము ఖ్యంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణా లు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

షుగర్

కొవిడ్ బారినపడి చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాత కొంతమందిలో మధుమేహం వచ్చినట్లు చెబుతున్నారు. తీవ్ర దాహం, అతిమూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపించి వైద్యుల సలహా మేరకు పరీక్ష చేయించుకుంటే షుగర్ భయటపడిందని అంటున్నారు. కొవిడ్ సమయంలో స్టెరాయిడ్స్ వాడటం వల్లనే తమకు షుగర్ వచ్చిందని వాపోతున్నారు. అయితే చాలామంది తమకు మధుమేహం ఉన్నా దానిని గుర్తించరని, కొవిడ్ సమయంలో వచ్చే సమస్యలలో పరీక్షలు చేయిస్తే వారిలో షుగర్ భయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ బారిన పడిన సమయంలో తమ స్నేహితులు, బంధువులకు వాడిన ప్రిస్కిప్షన్ మందులను వైద్యులను సంప్రదించకుండానే కొందరు సొంతంగానే వాడుతున్నారని, ఇలాంటి వారిలో షుగర్‌తోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. థర్డ్‌వేవ్‌లో కొవిడ్ బాధితులకు స్టెరాయిడ్స్ ఇవ్వలేదని, ఆ కారణంగా షుగర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు.

లక్షణాలను బట్టి చికిత్స : డాక్టర్ జి.నవోదయ

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పోస్టు కొవిడ్ లక్షణాలను బట్టి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యకు తగిన చికిత్స అందించవలసి ఉంటుందని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కన్సల్టెం ట్ జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ జి.నవోదయ పేర్కొన్నారు.రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తా యని తెలిపారు. కొంతమంది వారం పది రోజులలోపే ఈ లక్షణాలు పూర్తిగా తగ్గిపోతుండగా, మరికొందరిలో మాత్రం తగ్గడం లేదని పేర్కొన్నారు. పోస్టు కొవిడ్ లక్షణాలు ఎక్కువ కాలం ఉంటే ఏమా త్రం నిర్లక్షం చేయవద్దని సూచించారు. కొవిడ్ తగ్గిన తర్వాత రెండు రోజుల నుంచి 10 రోజులకుపైగా తీవ్ర అలసట, శ్వాస తీసుకోవ డంలో ఇబ్బంది, దగ్గు, జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. సకాలంలో సమస్యను గుర్తించి చికిత్స తీసుకోకపోతే ధీర్ఘకాలికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు అవకాశం ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News