Monday, April 29, 2024

వెంటనే హెచ్ 4 వీసా పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

Immediate H4 visa renewal: MP's letter to Biden

 

బైడెన్‌కు ఎంపిల లేఖ

వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసాదార్ల జీవిత భాగస్వామ్యుల ఉద్యోగ అనుమతిని పునరుద్ధరించాలని 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు కోరారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్‌కు ఈ మేరకు లేఖ రాశారు. ట్రంప్ అధికార యంత్రాంగం ఈ వర్క్ ఆథరైజేషన్‌పై తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని వీరు తెలియచేశారు. హెచ్ 1 బి వీసా జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగాలు చేసుకునే ఇంతకు ముందటి అనుమతితో అత్యధికంగా లబ్ధి పొందిన వారిలో నైపుణ్యపు భారతీయ ఐటి మహిళలే ఉన్నారు. వీరు వివాహాలు చేసుకున్న తరువాత హెచ్ 1బి వీసాదార్లు అయిన జీవిత భాగస్వాములతో ఉంటూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వీరికి జారీ చేసే హెచ్ 4 వీసాల ప్రాతిపదికన వారికి వారి అర్హతలను బట్టి ఉద్యోగాలు వస్తాయి. అయితే వీటిని ట్రంప్ తన అధికార అంతంలో అమెరికా ఫస్ట్ పాలసీతో ప్రస్తుతానికి నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. దీనిని దేశాధ్యక్షులు కానున్న బైడెన్ వెంటనే రద్దు చేయాలని, హెచ్ 4 వీసాలు వెలువరించాలని పేర్కొంటూ రాసిన లేఖపై ఇండో అమెరికన్ ఎంపిలు అయిన డాక్టర్ అమి బెరా, రాజా కృష్ణమూర్తి , ప్రమీలా జయపాల్ వంటి వారు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News