Monday, April 29, 2024

పబ్‌జి సహా మరో 47 యాప్‌లపై నిషేధం..?

- Advertisement -
- Advertisement -

India Bans 47 more apps including Pubg?

న్యూఢిల్లీ: సోమవారం 47 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. వీడియో గేమింగ్ యాప్ పబ్‌జిపైనా నిషేధం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. నెల రోజుల క్రితం చైనాకు చెందిన 59 యాప్‌ల్ని నిషేధించిన కేంద్రం మరో 275 యాప్‌లపై నిషేధం విధించడంపై పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో నిషేధానికి గురైన యాప్‌లతో తాజాగా నిషేధించిన 47 యాప్‌లకు లింక్‌లున్నట్టు చెబుతున్నారు. పబ్‌జిని భారత్‌లో 17 కోట్ల 50 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దక్షిణ కొరియా కంపెనీ బ్లూహోల్ రూపొందించిన ఈ యాప్‌లో చైనాకు చెందిన టెన్సెంట్‌కు వాటాలున్నాయి. పబ్‌జి వల్ల యువకులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్న అభ్యంతరాలు ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి వ్యక్తమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో దీనిపై తాత్కాలిక నిషేధం అమలవుతోంది. పాకిస్థాన్‌లో ఇటీవలే దీనిపై నిషేధం విధించగా, ఈ నెల 26న అక్కడి కోర్టు నిషేధాన్ని తొలగించింది.

India Bans 47 more apps including Pubg?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News