Monday, April 29, 2024

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్

- Advertisement -
- Advertisement -

India-China Troops Clash in Sikkim border

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు చర్చలు జరుపుతూనే.. మరోవైపు చొరబాటుకు చైనా ప్రయత్నిస్తుంది. తాజాగా సిక్కింలో చొరబాటుకు యత్నించిన చైనా సైనికులను భారత బలగాలు అడ్డుకున్నాయి. దీంతో సరిహద్దులో స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Courtesy by India Today

ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాకు బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకున్నది. సోమవారం రాజ్ నాథ్ సింగ్ వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రష్యాకు బయలుదేరారు. రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో నిర్వహించే రెండో ప్రపంచ యుద్ధం 75వ విజయోత్సవ పరేడ్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొనున్నారు. రష్యా, భారత్‌ ల మధ్య మంచి స్నేహాబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాతో రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు.

India-China Troops Clash in Sikkim border

India-China Troops Clash in Sikkim border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News