Saturday, May 11, 2024

భారత్‌కు అందిన రెండో విడత స్విస్ ఖాతాల వివరాలు

- Advertisement -
- Advertisement -

India has got second set of Swiss bank account details

న్యూఢిల్లీ/ బెర్నె: స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కింద ఆటోమేటిక్ సమాచార మార్పిడి (ఎఇఒఐ)లో భాగంగా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న భారతీయులు, భారతీయ సంస్థలకు సంబంధించిన రెండో విడత సమాచారం భారత్‌కు అందింది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి కింద ఈ ఏడాది స్విట్జర్లాండ్ ఫెడరల్ టాక్స్ అడినిస్ట్రేషన్‌నుంచి సమాచారం అదుకున్న 86 దేశాల్లో భారత్ ఒకటి. ఈ ఒప్పందం కింద భారత్ 2019 సెప్టెంబర్‌లో తొలి సారిగా స్విట్జర్లాండ్‌నుంచి అక్కడి బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న భారతీయులకు సంబంధించి వివరాలు అందుకుంది. కాగా ఈ ఏడాది వివిధ దేశాలతో స్విట్జర్లాండ్ పంచుకున్న సమాచారంలో దాదాపు 31 లక్షల ఆర్థిక ఖాతాలకు సంబంధించిన వివరాలున్నట్లు ఎఫ్‌టిఎ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

2019లో కూడా దాదాపుగా ఇంతే సంఖ్యలో ఖాతాల వివరాలున్నాయి. కాగా ఎఫ్‌టిఎ ప్రకటనలో భారత్ పేరును ప్రధానంగా పేర్కొనకపోయినప్పటికీ స్విట్జర్లాండ్ అక్కడి బ్యాంకుల్లో ఖాతాల కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాలు అందజేసిన ప్రముఖ దేశాల్లో భారత్ కూడా ఒకటని అధికారులు పిటిఐకి తెలిపారు. కాగా ఈ ఏడాది స్విట్జర్లాండ్ 86 దేశాలతో పంచుకున్న 30 లక్షలకు పైగా ఖాతాల వివరాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో భారతీయులు, భారతీయ సంస్థలకు చెందిన వివరాలున్నాయని కూడా ఆ అధికారులు తెలిపారు.

ఇది కాకుండా పన్నుల ఎగవేత లాంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా అధికారుల అభ్యర్థన మేరకు స్విస్ ప్రభుత్వం వందకు పైగా భారతీయ పౌరులు, సంస్థలకు చెందిన వివరాలను కూడా గత ఏడాది కాలంలో మన దేశానికి అందజేసింది. వీటిలో చాలావరకు 2018కి ముందు మూతపడిన ఖాతాలకు సంబంధించినవే ఉన్నాయి. కాగా 2018 నాటికి యాక్టివ్‌గా ఉన్న లేదా అప్పుడు మూతపడిన ఖాతాలకు మాత్రమే ఎఇఓఐ ఒప్పందం వర్తిస్తుంది. వీటిలో కొన్ని పనామా, బ్రిటీష్ వర్జిన్ దీవులు, కేమన్ ఐలాండ్స్‌లాంటి దేశాల్లో భారతీయులు ఏర్పాటు చేసిన సంస్థలకు చెందినవి కాగా, వ్యక్తులకు సంబంధించిన వాటిలో చాలా వరకు వ్యాపారవేత్తలు, కొంతమంది రాజకీయ నాయకులు, మాజీ రాజవంశీకులు, వారి కుటుంబ సభ్యులకు చెందినవి ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News