Monday, April 29, 2024

గ్రేటర్‌లో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy Rains in Greater Hyderabad

లో ఓల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయంపై
ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి జి.రఘుమారెడ్డి సమీక్షించారు. భారీ వర్షంతో రాజేంద్రనగర్ సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్‌నగర్ సర్కిళ్ల ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎండి సూచించారు. వర్షంనీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియచేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లో ఓల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912/100 స్థానిక ప్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూం 7382072104, 7382072106,7382071574 నెంబర్‌లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Heavy Rains in Greater Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News