Monday, April 29, 2024

బిడెన్ అధ్యక్షుడైనా రెండు నెలలు కూడా ఆ పదవిలో ఉండరు

- Advertisement -
- Advertisement -

Trump made harsh remarks on Kamala Harris

 

నెల రోజులకే లాగేసుకుంటారు

కమలా హారిస్‌పై ట్రంప్ మండిపాటు

వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలిచినా, ఆయణ్ని ఆ పదవిలో కమలా హారిస్ రెండు నెలలు కూడా ఉండనీయరని, నెల రోజుల్లోనే లాగేసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమె సోషలిస్ట్ కూడా కాదు, కమ్యూనిస్ట్. సెనేటర్ బెర్నీసాండర్స్(సోషలిస్ట్)నే పక్కన పెట్టారు. ఆమె కమ్యూనిస్ట్ అంటూ ట్రంప్ విమర్శించారు. కరోనాతో బాధపడుతున్న ట్రంప్ ప్రస్తుతం వైట్‌హౌస్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఫోన్ ద్వారా గురువారం ట్రంప్ గంటపాటు ఇంటర్వూ ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్ నుంచి వైట్‌హౌస్‌కు చేరుకున్న తర్వాత ట్రంప్ మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు.
\

బుధవారం రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్‌పెన్స్‌తో డిబేట్ సందర్భంగా కమలా హారిస్ దురుసుగా వ్యవహరించారని ట్రంప్ మండిపడ్డారు. ఆమె చాలా భయంకరమైన మనిషి అన్నారు. ఉపాధ్యక్షుల మధ్య జరిగిన చర్చ వారి ఇద్దరి వ్యక్తిగతం కాదని, రెండు పార్టీల ఆలోచనా విధానాలని ట్రంప్ అన్నారు. ఆమె ఆలోచనలు చూస్తే మీకే అర్థమవుతుంది. సరిహద్దుల ద్వారా దేశంలోకి హంతకులు, రేపిస్టులకు స్వాగతం పలకాలని చూస్తున్నారని ట్రంప్ విమర్శించారు. జో బిడెన్, హారిస్ అధిక పన్నుల్ని కోరుకుంటున్నారు. పోలీస్ నిధులకూ కోత పెట్టాలన్నది వారి విధానమని ట్రంప్ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News