Saturday, April 27, 2024

ఎనిమిదేళ్లలో 750 పులులను కోల్పోయిన దేశం

- Advertisement -
- Advertisement -
India has lost 750 tigers in last eight years
మరణాల్లో మధ్యప్రదేశ్ ప్రథమస్థానం

న్యూఢిల్లీ : వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతిచెందాయి. అన్ని రాష్ట్రాల కన్నా మధ్యప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో 173 వరకు పులులు మృతి చెందాయని అధికారిక డేటా వెల్లడించింది. ఈ మరణాల్లో 369 సహజ కారణాల వల్ల కాగా, వేటాడడం వల్ల 168, పర్యవేక్షణలో 70,అసహజంగా ప్రమాదాలు, సంఘర్షణల్లో 42 మరణాలు సంభవించాయి. 201219 మధ్య కాలంలో 101 పెద్ద పులులను నిర్బంధించారని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అధారిటీ(ఎన్‌టిసిఎ) పాత్రికేయులు ఒకరు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు వివరాలు తెలియచేసింది. 201020 మధ్య కాలానికి సంబంధించిన వివరాలు అడగ్గా 2012 నుంచి లభించిన వివరాలనే ఎన్‌టిసిఎ తెలియచేసింది.

గత నాలుగేళ్లలో పులుల సంఖ్య 2226 నుంచి 2976కు అంటే 750 వరకు పెరిగిందని గత డిసెంబర్‌లో కేంద్ర పర్యావరణ , అటవీ, మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో అత్యధికంగా 173 వరకు మరణాలు నమోదైన మధ్యప్రదేశ్‌లో వేటవల్ల 38, సహజంగా 94,పర్యవేక్షణలో 19,అసహజంగా 6, నిర్బంధించడంతో 16 మరణాలు సంభవించాయి. దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్‌లో 526 వరకు పులులు ఉన్నాయి. మరణాల్లో మధ్యప్రదేశ్ తరువాత రెండోస్థానం మహారాష్ట్రలో 125 పెద్ద పులులు చనిపోయాయి. తరువాత కర్నాటకలో 111,ఉత్తరాఖండ్‌లో 88,తమిళనాడు, అస్సోంలో 54 వంతున, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో 35 వంతున, రాజస్థాన్‌లో 17, బీహార్, పశ్చిమబెంగాల్‌ల్లో 11వంతున, చత్తీస్‌గఢ్‌లో 10 వరకు పులులు మృతి చెందాయి.

ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌లో ఏడేసి వంతున, తెలంగాణలో ఐదు, ఢిల్లీ, నాగాలాండ్‌లో రెండేసివంతున హర్యానా, గుజరాత్‌లో ఒక్కొక్కటి వంతున పులులు చనిపోయాయి. అదృశ్యమైన పులుల వివరాలు మాత్రం లభ్యం కాలేదు. వేట, తదితర కారణాలతో పులులు ఎక్కువ సంఖ్యలో చనిపోవడం ఆందోళన కలిగించే విషయమని, వేటగాళ్ల నుంచి వాటిని రక్షించే చర్యలు విస్తృతం చేయాలని భోపాల్‌కు చెందిన వన్యప్రాణుల ఉద్యమనేత అజయ్‌దుబే ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News