Thursday, May 16, 2024

చైనాకు ఔషధాలు పంపేందుకు భారత్ సిద్ధం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇండియా అతిపెద్ద ఫార్మాసూటికల్ ఉత్పత్తిదారుగా ఉంది. చైనాలో పెరుగుతున్న కొవిడ్19 కేసులు చూసి ఆ దేశానికి జ్వరం నివారణ మందులు పంపేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇండియన్ డ్రగ్ ఎక్స్‌పోర్ట్ కమిటీ అధిపతి తెలిపారు. ఈ నెల ఆరంభంలో చైనా కొవిడ్-19 నిబంధనలు ఎత్తివేయడంతో అక్కడ ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. అక్కడ ఇప్పుడు జ్వరానికి కావలసిన ఔషధాలకు, వైరల్ టెస్ట్ కిట్స్‌కు బాగా డిమాండ్ ఉంది.

చైనా నుంచి మన దేశ ఔషధ తయారీదారులకు ‘ఇబుప్రోఫెన్’, ‘పారాసెటమాల్’ కొటేషన్లు కావాలన్న వినతులు వస్తున్నాయని ఫార్మాసూటికల్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెక్సిల్) చైర్మన్ సాహిల్ ముంజల్ తెలిపారని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తెలిపింది. చైనాలో ఇబుప్రోఫెన్, పారాసెటమాల్ ప్రస్తుతం తక్కువ సప్లయ్ ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది. అయితే న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ మాత్రం ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనరిక్ ఔషధ తయారీలో భారత్ అతిపెద్ద ఉత్పత్తిదారు. అందుచేత చైనాకు సాయపడేందుకు భారత దేశం సిద్ధంగా ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ తన రొటీన్ బ్రీఫింగ్‌లో “ మేము చైనా కొవిడ్ పరిస్థితిని గమనిస్తున్నాం. ప్రపంచంలోని పలుదేశాలకు మేము ఫార్మాసీ సాయం అందించాం” అన్నారు. ఫార్మ్‌ఎక్సిల్ తాజా వార్షిక రిపోర్టు ప్రకారం చైనాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఔషధాలు కేవలం 1.4 శాతమే. ఇప్పటికీ భారత్ నుంచి ఔషధాలు ఎక్కువగా  ఎగుమతి అయ్యేది అమెరికాకే. కొవిడ్-19 మళ్లీ ఉదృతం అవుతోందన్న ఆందోళనలు వెళ్లువెత్తుతుండడంతో భారత ఔషధ కంపెనీలు మళ్లీ గత కొన్ని రోజులుగా ఉత్పత్తిని పెంచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News