Sunday, April 28, 2024

మన జవానులు సకాలంలో స్పందించారు: రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ నేడు మధ్యాహ్నం వాయిదా అనంతరం, తిరిగి సమావేశం అయ్యాక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. “భారత సైన్యం డిసెంబర్ 9న సకాలంలో స్పందించి చైనా పిఎల్‌ఏ ట్రూపులను అడ్డుకుంది. మన జవానులు భూభాగాన్ని ఆక్రమించకుండా అడ్డుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో మన సైన్యానికి, వారి సైన్యానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది” అన్నారు. వారు వారి సైన్యాన్ని వెనక్కి ఉపసంహరించుకున్నారని స్పష్టం చేశారు. “మన సైనికులు ఏ మాత్రం భయపడకుండా వీరోచితంగా అడ్డుకున్నారు. వారు వెను తిరిగేలా చేశారు” అన్నారు. ఈ విషయాన్ని దౌత్య మార్గంలో చైనా దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

“ ఆ ఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంతపు స్థానిక కమాండర్ , చైనా కమాండర్‌తో ‘ఫ్లాగ్ మీటింగ్’ చేపట్టారు. ఆ ఘటన గురించి చర్చించారు. చైనా తామేమి అలాంటి చర్యలకు పాల్పడలేదని చెప్పిందని, సరిహద్దులో శాంతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది” అన్నారు. భారత బలగాల తరఫున ఎవరూ గాయపడలేదని, ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించడం వల్ల భారత జవానులు, చైనా సైన్యం వారివారి పాత స్థానాలకు వెనక్కి జరిగినట్లు తెలిపారు. “మన సైనికుల ధైర్య సాహసాలను, అంకిత భావాన్ని సభ గౌరవిస్తుందని నేను విశ్వసిస్తు న్నాను” అన్నారు. ఇదిలావుండగా, రాజ్‌నాథ్ ప్రసంగానికి ముందు భారత, చైనా ఘర్షణపై ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో గందరగోళాన్ని సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News