Monday, April 29, 2024

భారతీయ శాస్త్రవేత్త స్వాతినాయక్‌ కు నార్మన్ ఇ బొర్లాగ్ అవార్డు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : పోషకాహార రంగంలో విశేష పరిశోధనలు చేసినందుకు గాను భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతినాయక్‌కు 2023 కు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన నార్మన్ ఇ బొర్లాగ్ అవార్డు వరించింది. నోబెల్ బహుమతి గ్రహీత, హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఇ బొర్లాగ్ గౌరవార్థం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును నెలకొల్పింది. ఒడిశాకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త ప్రస్తుతం న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇంటర్నేషనల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో పరిశోధనలు చేస్తున్నారు. స్వాతినాయక్‌ను అత్యుత్తమ యువశాస్త్రవేత్తగా ఫౌండేషన్ అభివర్ణించింది. ఐఆర్‌ఆర్‌ఐ లో విత్తన విధానం,

ఉత్పత్తి యాజమాన్య విభాగం దక్షిణాసియా ప్రతినిధిగా స్వాతినాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డు సాధించిన మూడవ భారతీయ వ్యక్తిగా, మొదటి ఒడిస్సా ప్రతినిధిగా రికార్డుకెక్కారు. డిమాండ్ ఆధారిత వరి విత్తన వ్యవస్థలు, పరీక్షించడం నుంచి అందరికీ అందుబాటు లోకి తీసుకురావడంలో నూతన ఆవిష్కరణలు కనుగొన్నందుకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ వివరించింది. అమెరికా లోని డెస్ మోయినెస్‌లో అక్టోబర్ 2426 తేదీల్లో 2023 నార్మన్ ఇ బొర్లాగ్ అంతర్జాతీయ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును స్వాతినాయక్ అందుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News