Monday, April 29, 2024

టీమిండియాకు కలిసివచ్చిన 2021

- Advertisement -
- Advertisement -

India's historic performance in Tests

టెస్టుల్లో భారత్ చారిత్రక ప్రదర్శన

మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రికెట్ చరిత్రలోనే 2021 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఏడాది టీమిండియా టెస్టు క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేగాక ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లోనూ సత్తా చాటింది. అర్ధాంతరంగా ముగిసిన సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో నిలిచింది. అంతేగాక తాజాగా సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ జయకేతనం ఎగుర వేసింది. ఇలా ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో టీమిండియా చిరకాలం గుర్తుండి పోయే ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆరంభంలో పేలవమైన ప్రదర్శనతో టీమిండియా నిరాశ పరిచింది. తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై అవమానకర రీతిలో ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా చారిత్రక ప్రదర్శనతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ సిరీస్ అత్యుత్తమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య టీమిండియా సిరీస్‌ను గెలుచుకుని పెను సంచలనం సృష్టించింది.

గాయాలతో పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా పూర్తిగా కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ అత్యంత అరుదైన విజయాన్ని దక్కించుకుంది. రిషబ్ పంత్, అజింక్య రహానె, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, జడేజా తదితరులు బ్యాట్‌తో సత్తా చాటారు. ఇక సిరాజ్, శార్దూల్, అశ్విన్, బుమ్రా, జడేజాలు బౌలింగ్‌లో చెలరేగి పోయారు. దీంతో ఈ సిరీస్‌ను భారత్ 21తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ భారత్ అత్యంత నిలకడైన ప్రదర్శన చేసింది. సొంత గడ్డపై ఎంతో మెరుగైన రికార్డును కలిగిన ఇంగ్లండ్‌ను ఆత్మరక్షణలో పడేస్తూ సిరీస్‌లో 21 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ భారత్ జయకేతనం ఎగుర వేసింది. ఈ సిరీస్‌లో భారత్ 10తో విజయం అందుకుంది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై తొలి మ్యాచ్‌లోనే గెలిచి మూడు టెస్టుల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది.

ఈ ఏడాది భారత్ ఇప్పటికే మూడు టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఇందులో రెండు విదేశీ సిరీస్‌లు ఉండడం విశేషం. ఒకప్పుడూ విదేశీ సిరీస్‌లంటేనే భారత్ ముందుగానే చేతులెత్తేసేది. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఆట తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాట్స్‌మన్‌గా పెద్దగా రాణించక పోయినా కోహ్లి జట్టును మాత్రం విజయపథంలో నడిపించడంలో సఫలమవుతున్నాడు. ఇక సౌతాఫ్రికా సిరీస్ కోహ్లికి చాలా కీలకంగా తయారైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్నా కోహ్లికి తొలి టెస్టులో విజయం పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇదే జోరును కొత్త సంవత్సరంలోనూ కొనసాగించి దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకోవాలని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News