Saturday, April 27, 2024

పోలీస్ అకాడమీలో గన్ ‌మిస్‌ఫైర్.. రిజర్వు ఇన్స్‌స్పెక్టర్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

Injuries to Reserve Inspector with Gun Misfire

 

మనతెలంగాణ, హైదరాబాద్ : రాజా బహదూర్ వెంకట రామారెడ్డి పోలీస్ అకాడమీలో గన్ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వు ఇన్స్‌స్పెక్టర్ గాయపడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్సైలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో మహిళా ట్రైనీ ఎస్సై ఫైర్ ప్రాక్టీస్ చేస్తుండగా పేలకపోవడంతో ఇన్స్‌స్పెక్టర్ దానిని తీసుకుని కాల్చేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలింది. దీంతో వారికి శిక్షణ ఇస్తున్న రిజర్వు ఇన్స్‌స్పెక్టర్ వినోద్ తొడ భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఇన్స్‌స్పెక్టర్‌ను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వినోద్ 1996 బ్యాచ్‌కు చెందిన ఎస్సైగా ఎంపికయి డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ప్రస్తుతం రిజర్వు ఇన్స్‌స్పెక్టర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News