Sunday, April 28, 2024

బాసర ట్రిపుల్ ఐటి లో జరుగుతున్న ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

- Advertisement -
- Advertisement -
ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటిలో జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గత అయిదు రోజుల్లో దీపిక,లిఖిత ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటే సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు.

విద్యార్థులు అంటే చిన్న చూపు అని, అసలు బాసర ట్రిపుల్ ఐటిలో లోపల ఎం జరుగుతుందని? క్యాంపస్‌లోకి విద్యార్థి సంఘాలను,మేధావులను వెళ్లకుండా అరెస్ట్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. నిర్బంధాలు చేయడం ఏంటని, నిషేధిత ప్రాంతంలాగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి ఆత్మస్థైర్యం కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని విమర్శించారు.

6000 విద్యార్థులు ఉన్న క్యాంపస్ లో ఎంత మంది కౌన్సిలింగ్ టీచర్లు ఉన్నారు? విద్యార్థులకు ఉన్న సౌకర్యాలు సరిపోతున్నాయా? విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు ఏంటి?, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయో? తెలియాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి క్యాంపస్ లో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News