Wednesday, May 1, 2024

భారత సంతతి వ్యక్తికి ‘ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

- Advertisement -
- Advertisement -

Inventor of the Year Award for Indian-born person

 

వాషింగ్టన్ : ఎలెక్ట్రానిక్ , కృత్రిమ మేథ రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా భారత సంతతికి చెందిన అమెరికన్ రాజీవ్ జోషికి ‘ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. న్యూయార్క్ లోని ఐబిఎం థామ్సన్ వాట్సన్ రీసెర్చి సెంటర్‌లో పనిచేస్తున్న రాజీవ్ తన పేరుపై 250 కు పైగా పేటెంట్లను సాధించుకున్నారు. ఈ నెల మొదట్లో అవార్డుల కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక వార్షిక అవార్డును న్యూయార్క్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ నుంచి అందుకున్నారు. ఐఐటి ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) నుంచి ఎంఎస్ డిగ్రీ పొందారు. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్శిటీ నుంచి మెకానికల్, ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ నుంచి పిహెచ్‌డి పొందారు.

ప్రాసెసర్లు, సూపర్‌కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, అత్యాధునిక గాడ్జెట్లలో వినియోగించే అనేక కొత్త పరికరాలను ఆవిష్కరించ గలిగారు. ఇవన్నీదైనందిన జీవితాల్లోను, కమ్యూనికేషన్ రంగం లోను, వైద్యశాస్త్రం లోను, వైద్యరంగం లోను ఎంతగానో ఉపయోగపడ్డాయి. అవసరం, ఆసక్తే తనను ఈ దిశగా నడిపించాయని అవార్డు అందుకున్న తరువాత ఆయన అన్నారు. మార్కొనీ, మేడం క్యూరీ, రైట్ సోదరులు, జేమ్స్ వాట్, అలెగ్జాండర్ బెల్, థామస్ ఎడిసన్ తదితర గొప్పవారి జీవిత విశేషాలను తన తల్లిదండ్రులు చిన్నతనంతో తనకు చెప్పేవారని, వారి విజయ గాధలు, ఆవిష్కరణలే తన ఆలోచనలను మార్చాయని సైన్సు, టెక్నాలజీ రంగాల్లో ఆసక్తి పెంపొందడానికి దోహద పడ్డాయని అన్నారు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేథ, క్లౌడ్ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News