Monday, April 29, 2024

రష్యా నుంచి చమురు దిగుమతి ఒప్పందం కుదుర్చుకున్న ఐఒసి

- Advertisement -
- Advertisement -

IOC deal with Russia
ముంబయి: రష్యా ఆయిల్ కంపెనీ నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి) ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం అని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు చమురు దిగుమతులపై కట్టడి(ఎంబార్గో) విధించాయి. అయితే రష్యా ఆయిల్ కంపెనీల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారతీయ చమురు కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇదిలావుండగా చమురు దిగుమతికి సంబంధించి మరిన్ని భారతీయ చమురు కంపెనీలు రష్యా చమురు కంపెనీలతో ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నాయి. భారత తన అవసరాల కోసం 80 శాతం మేరకు చమురును దిగుమతి చేసుకుంటోంది. కాగా ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు, ఇక బ్రెంట్ క్రూడ్ ధర అత్యధికంగా బ్యారెల్‌కు 140 డాలర్ల మేరకు చేరింది. ఇదిలావుండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటికే 3 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ చమురును అంతర్జాతీయ మార్కెట్ రేట్ కన్నా తక్కువకు రష్యా భారత్‌కు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News