Saturday, April 27, 2024

పంజాబ్ హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

పంజాబ్ హ్యాట్రిక్ విజయం

ధావన్ సెంచరీ వృథా, పురాన్ మెరుపులు, ఢిల్లీపై కింగ్స్ గెలుపు

IPL 2020: KXIP Won by 5 Wickets against DC

దుబాయి: ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా మూడో విజయం సాధించింది. హ్యాట్రిక్ గెలుపుతో రాహుల్ సేన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ మరో ఓవర్ మిగిలివుండగానే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. నికోలస్ పూరన్ 28 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 53 పరుగులు చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గేల్ (29), మాక్స్‌వెల్ (32) తమవంతు సహకారం అందించారు.
ధావన్ జోరు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ శిఖర్ ధావన్ అండగా నిలిచాడు. కిందటి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ఆ ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. మరో ఓపెనర్ పృథ్వీషా మరోసారి నిరాశ పరిచాడు. 11 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధావన్ స్కోరును పరిగెత్తించాడు. ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ముందుకు సాగాడు. అయ్యర్ సమన్వయంతో ఆడగా ధావన్ దూకుడును ప్రదర్శించాడు. అయితే 14 పరుగులు చేసిన అయ్యర్‌ను మురుగన్ అశ్విన్ వెనక్కి పంపాడు. దీంతో 48 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోయాడు. డిఫెన్స్‌కే పరిమితం కావడంతో స్కోరు వేగం నెమ్మగించింది. నెమ్మదిగా ఆడిన పంత్ 20 బంతుల్లో 14 పరుగులు మా త్రమే చేశాడు. తర్వాత వచ్చిన స్టార్ ఆటగాడు స్టోయినిస్ (9) కూడా వేగంగా ఆడడంలో విఫలమయ్యా డు. హెట్‌మెయిర్ (10) పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు.
రికార్డు శతకం..
అయితే ధావన్ మాత్రం తన జోరును కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు ను పరిగెత్తించాడు. ఇదే క్రమంలో ఐపిఎల్‌లో వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. చెలరేగి ఆడిన ధావన్ 61 బంతుల్లోనే మూడు సిక్సర్లు, 12 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఐపిఎల్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా కూడా ధావన్ రికార్డు సృష్టించాడు. కాగా ధావన్ అజేయ సెంచరీతో ఢిల్లీ స్కోరు ఐదు వికెట్లకు 164 పరుగులకు చేరింది.

IPL 2020: KXIP Won by 5 Wickets against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News