Sunday, May 5, 2024

ఐపిఎల్ 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ల షెడ్యూల్‌..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఐపిఎల్ 13వ సీజన్ మార్చి 29న వాంఖడే స్టేడియంలో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తమ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారికంగా ఐపిఎల్ షెడ్యూల్‌ను నిర్వాహకులు వెల్లడించనప్పటికీ రాయల్ చాలెంజర్స్, సన్‌రైజర్స్‌జట్లు తమ షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 1న ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. మొత్తం 14 మ్యాచ్‌ల వివరాలను సన్‌రైజర్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. చివరి మ్యాచ్ మే 15న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరుగుతుంది.

సన్‌రౌజర్స్ హైదరాబాద్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్‌లేక్, నటరాజన్, అభిషేక్ శర్మ, షహ్బాజ్ నదీమ్, మిచెల్ మార్ష్, ఫాబియన్ అలెన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సంజయ్ యాదవ్, జాన్ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, బసవక సందీప్, బాసిల్ తంపి.

IPL 2020 Sunrisers Hyderabad Schedule Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News