Friday, April 26, 2024

బెంగళూరుకు హైదరాబాద్ షాక్..

- Advertisement -
- Advertisement -

బెంగళూరుకు హైదరాబాద్ షాక్
5 వికెట్ల తేడాతో వార్నర్ సేన విజయం

IPL 2020:SRH Win by 5 Wickets against RCB

షార్జా: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ అదరగొట్టింది. తొలుత బంతితో తర్వాత బ్యాట్‌తో ఆధిపత్యం చెలాయించి బెంగళూరుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 120 పరుగులే చేయగలిగింది. బెంగళూరు జట్టులో పడిక్కల్, కెప్టెన్ కోహ్లీ, డివిలియర్స్ సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కాగా 31బంతుల్లో 32 పరుగులు చేసిన ఫిలిప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం లక్ష ఛేదనకు దిగిన హైదరాబాద్ 14.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ల క్షాన్ని చేరుకుంది. కెప్టెన్ వార్నర్ విఫలమైనా సాహా (32 బంతుల్లో 39), హోల్డర్ ( 10 బంతుల్లో 26) సత్తా చాటారు. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మరో వైపు బెంగళూరు ఘోర పరాజయంతో నెట్న్‌ర్రేట్‌ను తగ్గించుకుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేనకు శుభారంభం దక్క లేదు. ఓపెనర్ పడిక్కల్ (5), కెప్టెన్ విరాట్ కోహ్లీ(7)ను సందీప్ శర్మ పెవిలియన్‌కు చేర్చిఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎబి డెవిలియర్స్ (24 బంతుల్లో 24 పరుగులు) ఫిలిప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే నదీమ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన డివిలియర్స్ అభిషేక్ చేతికి చిక్కాడు. కొద్ది సేపటికే ఫిలిప్ కూడా వెనుదిరగడంతో 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. అనంతరం గురుకీరత్ సింగ్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్(18 బంతుల్లో 21) వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో నటరాజన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.తర్వాత వచ్చిన మోరిస్, ఉదాన కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మరో వైపు పదో ఓవర్‌లో వచ్చిన గురుకీరత్ చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ధాటిగా ఆడలేకపోయాడు. 24బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్‌లు చెరి రెండు వికెట్లు తీయగా, నదీమ్, రషీద్, నటరాజన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.

IPL 2020:SRH Win by 5 Wickets against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News