Sunday, May 12, 2024

పొలార్డ్ సిక్సర్ల వర్షం.. చెన్నైపై ముంబై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2021: MI won by 4 wickets against CSK

పొలార్డ్ వీర విధ్వంసం.. చెన్నైపై ముంబై సంచలన విజయం
న్యూఢిల్లీ : ఐపిఎల్ చరిత్రలోనే చిరకాలం గుర్తుండి పోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. కీరన్ పొలార్డ్ చారిత్రక ఇన్నింగ్స్‌తో కదం తొక్కడంతో చెన్నై ఉంచిన 219 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ముంబై చివరి బంతికి ఛేదించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన పొలార్డ్ 34 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో అజేయంగా 87 పరుగులు చేసి ముంబైకి చారిత్రక విజయం అందించాడు.
డుప్లెసిన్, మొయిన్ దూకుడు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన మొయిన్ అలీతో కలిసి మరో ఓపెనర్ డుప్లెసిస్ స్కోరును పరిగెత్తించాడు. ఇద్దరు పోటీ పడి భారీ షాట్లు కొడుతూ పరుగుల వరద పారించారు. ఈ జంటను కట్టడి చేసేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరుస సిక్సర్లు, ఫోర్లతో వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వీరి విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా పరిగెత్తింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మొయిన్ అలీ 36 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 108 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. ఇక చెలరేగి ఆడిన డుప్లెసిస్ 4 సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 50 పరుగులు చేశాడు.
శివమెత్తిన రాయుడు..
మరోవైపు రైనా (2) నిరాశ పరిచాడు. అయితే ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అంబటి రాయు డు తనపై వేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన రాయు డు పరుగుల సునామీ సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను వీరబాదుడు బాదుతూ స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నిం గ్స్ ఆడిన రాయుడు 27 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి జడేజా 22 (నాటౌట్) అండగా నిలిచాడు. రాయుడు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెన్నై స్కోరు 218 పరుగులకు చేరింది.

IPL 2021: MI won by 4 wickets against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News