Monday, April 29, 2024

బెంగళూరుకు సవాల్.. నేడు రాజస్థాన్‌తో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్‌లో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలవడమే కాకుండా రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం బెంగళూరుకు ఉంది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కళ్లు చెదిరే విజయం సాధించింది. ఈ గెలుపు రాజస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బెంగళూరుపై కూడా గెలిచి నాకౌట్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే పట్టుదలతో రాజస్థాన్ ఉంది. ఇటు బెంగళూరు అటు రాజస్థాన్‌లోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు.

ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే క్రికెటర్లు ఉన్నారు. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, లోమ్రోర్, కేదార్ జాదవ్‌లతో బెంగళూరు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా టాపార్డర్ రాణిస్తే ఛాలెంజర్స్‌కు భారీ స్కోరు ఖాయం. అయితే భారీ స్కోరు సాధించినా ముంబై చేతిలో ఓటమి పాలుకావడంతో బెంగళూరు ఆత్మవిశ్వాసం దెబ్బతింది. ఈ మ్యాచ్‌లో అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చూడాలని జట్టు భావిస్తోంది.

మరోవైపు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, హెట్‌మెయిర్, రూట్, అశ్విన్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. అంతేగాక బౌల్ట్, అశ్విన్, చాహల్, సందీప్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News