Monday, April 29, 2024

భారతదేశంలో తెలంగాణ లేదా?

- Advertisement -
- Advertisement -

Is Telangana not in India? K Keshavarao asked

రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకింత కక్ష?
కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్నదాంట్లో రాష్ట్రానిదే అధిక శాతం
ధాన్యం కొనుగోళ్లపై మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరు గర్హనీయం
తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన టిఆర్‌ఎస్ ఎంపీలు
మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించిన కెకె, నామా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రైతుల మీద కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష? తెలంగాణ భారతదేశంలో లేదా? అని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు ప్రశ్నించారు. కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్న వాటాల్లో అధిక శాతం తెలంగాణ నుంచేనని అన్నారు. అయినప్పటికీ అడుగడుగునా రాష్ట్రంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తుండడం శోచనీయమన్నారు. రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలను పరిష్కరించరు….ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం అత్యం నిర్లక్షంగా వ్యవహరించడం సిగ్గుచేటని కెకె మండిపడ్డారు. ఇదేనా రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరించాల్సిన తీరు అని ఆయన నిలదీశారు. ధాన్యం కోనుగోలు వ్యవహారంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుని నిరసిస్తూ ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ ఎంపిలతో కలిసి కెకె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుపై బిజెపి నేతలు ఢిల్లీలో ఒక మాట….రాష్ట్రంలో మరోమాట చెబుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో టిఆర్‌ఎస్ నిరసన దీక్ష చేపట్టడానికి కేంద్రమే కారణమన్నారు. కేంద్రం మెడలు వంచైనా రైతులను కాపాడుకుంటామన్నారు. రాష్ట్రం మెడ మీద కేంద్రం కత్తిపెట్టి బాయిల్ రైస్ పంపకండి అని ఒప్పందం చేసుకుందని విమర్శించారు. వెయ్యేళ్లుగా వచ్చే సంప్రదాయం ఒకేసారి మారిపోదన్నారు. ఏ ప్రభుత్వం చెప్పలేని రీతిలో రైతులకు నేరుగా వరి పండించవద్దని చెప్పామన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరామన్నారు. కానీ బిజెపి నేతలు రైతన్నలను తప్పుదోవ పట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్ర రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కేంద్రాన్ని పదేపదే డిమాండ్ చేయాల్సి వచ్చిందన్నారు. కానీ ఈ విషయంలో కేంద్రం మొండిగా వ్యహరిస్తోందన్నారు. అయినప్పటికీ టిఆర్‌ఎస్ పార్టీ వెనకడుగు వేయదన్నారు. అవసరమైతే అన్ని పార్టీలకు ఏకం చేసైనా సరే….కేంద్రానికి తగు రీతిలో బుద్దిచెబుతామని ఈ సందర్భంగా కెకె హెచ్చరించారు.

అనంతరం లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతాంగంపై కేంద్రం కక్ష్య కట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి అన్ని రకాలుగా తీసుకు వెళ్లామన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. అభివృద్ధిలో అడ్డంకులు, రైతుల ధాన్యం కొనడానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్రంలో రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన కూడా తెలిపారన్నారు. వందల సంవత్సరాలుగా మన అవసరాలు తీరిన తర్వాత ఎఫ్‌సిఐ ద్వారా పంట సేకరణ జరుగుతుందన్నారు. అలాంటప్పుడు యాసంగిలో వచ్చే బియ్యం తీసుకొమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నామా ప్రశ్నించారు. దేశంలో వరి పంట సాగులో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. అయినప్పటికీ ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలను అవమనపరిచేలా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారన్నారు.

ఒకసారి పనిలేదా? మరోసారి తెలంగాణ ప్రజలు నూకలు తినాలి? అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నామా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినా….రాష్ట్ర రైతులను ఎలా కాపాడుకోవాలో సిఎం కెసిఆర్‌కు బాగా తెలుసన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో చివరి వరకు పోరాడుతామన్నారు. పోరాటాల గడ్డ నుంచి వచ్చామని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్ర ప్రజలు తగు విధంగా బుద్ధి చెబుతారని ఈ సందర్భంద నామా హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News