Saturday, May 4, 2024

48 గంటల్లో వైరస్‌ను చంపేస్తుందట!

- Advertisement -
- Advertisement -

Ivermectin Drug

 

కరోనా చికిత్సలో ‘ఐవర్‌మెక్టిన్’ డ్రగ్ అద్భుతంగా పని చేస్తుంది
శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు

వాషింగ్టన్: కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు చల్లని వార్త చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అవదుబాటులో ఉన్న యాంటీ పారాసిటిక్ డ్రగ్ ‘ఐవర్‌మెక్టిన్’తో కోవిడ్19ను ఎదుర్కోవచ్చని తెలిపారు. ఈ మేరకు మోనాష్ యూనివర్సిటీ బయో మెడిసిన్ డిస్కవరీ యూనిట్ (బిడిఐ), డీహెర్టీ యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. హెచ్‌ఐవి, జికా వైరస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘ఐవర్‌మెక్టిన్’కు బాధితుడి శరీరంలోంచి కరోనా క్రిములను పారదోలే శక్తి ఉందని ఈ స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్ కైలీ వాగ్‌స్టాఫ్ చెప్పారు. ‘ఐవర్‌మెక్టిన్ అనే ఔషధం ఎఫ్‌డిఎ అనుమతి పొందిన ఔషధం. ప్రపంచమంతటా దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు కూడా. ఇది ఎంతో సురక్షితమైన డ్రగ్ కూడా. పలు వైరల్ జ్వరాలపై ఐవర్‌మెక్టిన్ ప్రభావవంతంగా పని చేస్తుంది.

దీని సహాయంతో మానవ శరరీరంలో సెల్ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్19ను అడ్డుకోవచ్చని మా పరిశోధనలో వెల్లడైంది. ఈ మెడిసిన్ సింగిల్ డోస్‌లో బాధితుడి శరీరంలో వైరల్ డిఎన్‌ఎను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్‌తో 24 గంటల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. అందువల్ల అందుబాటులో ఉన్న ఈ మెడిసిన్‌తో చికిత్స చేస్తే మంచిది’ అని వాగ్‌స్టాఫ్‌చెప్పారు. అయితే ల్యాబ్ దశలో విజయవంతమైన తమ పరీక్షలను మనుషులపై క్లినికల్ ట్రల్స్ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ అధ్యయన వివరాలు యాంటీ వైరల్ రిసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమైనాయి.

Ivermectin Drug works in treatment of corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News