Monday, April 29, 2024

కాంగ్రెస్‌లో చేరేందుకు 20మంది ఎంఎల్‌ఎలు సిద్ధం: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి మధ్య పాలనా పరంగా ఎంతో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు.

బిజెపి తరపున విజయసాయి రెడ్డి వకాల్తా ఏమైనా పుచ్చుకున్నాడా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌లాంటి మహా నాయకుడి కొడుకు జగన్ ఇంత నీచమైన దగజారుడు రాజకీయాలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకూడ దని బావ, బావమరిది హరీశ్‌రావు, కెటిఆర్ కొత్త కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. బిజెపి అనే గొడుగు కిందే బిఆర్‌ఎస్, వైసిపిలు పనిచేస్తున్నా యంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బిజెపి ఆదేశాలతోనే ఎపి సిఎం జగన్, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పనిచేస్తు న్నారు. వ్యాపారుల ను కెసిఆర్, కెటిఆర్ అయోమయానికి గురి చేస్తున్నారు.

ఈ ప్రభుత్వం ఉండదని పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందొద్దని కెసిఆర్, జగన్ కుట్రలు చేస్తున్నారు. వారి ఎత్తుగడలను తిప్పి కొడతాం. ఎంఎల్‌ఎలను నిలబెట్టుకునేందుకు బిఆర్ ఎస్ నేతలు డ్రామాలు ఆడుతు న్నారు. 20 మంది ఆ పార్టీ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోపే ఈ 20 మందిని పార్టీలోకి తీసుకుంటాం’ అని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండటం పక్కా అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News